బన్నీకి నెగిటివ్! 15 డేస్ తరువాత పిల్లలతో! వీడియో వైరల్!

కరోనా.. కరోనా.. నువ్వు ఏమి చేస్తావు అంటే.. మనుషుల జీవితాలతో ఆటలు ఆడుతాను. ఉద్యోగాలను నిరుద్యోగులుగా మారుస్తాను. తల్లిద్రండ్రుల నుండి బిడ్డలను వేరు చేస్తాను అనిందట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.., ఇవన్నీ వాస్తవాలే. కరోనా కారణంగా నిత్యం జరుగుతున్న క్రియలే. అయితే.., ఈ కరోనా కష్టాలు సామాన్యులకు మాత్రమే కాదు.., సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. ఇందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరైన ఉదాహరణ. బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ ని కరోనా సోకింది. టెస్ట్ లో పాజటివ్ రావడంతో బన్నీ తన ఇంట్లోనే ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయాడు. రెండు వారాల చికిత్స, హోం ఐసోలేషన్ అనంతరం తాను కోవిడ్19 నుంచి కోలుకునట్టు బన్నీ ట్వీట్ చేశాడు. అయితే.., ఐసోలేషన్ లో ఉన్న సమయంలో బన్నీ తన పిల్లలకి దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ.., ఇన్ని రోజుల తరువాత అల్లు అర్జున్ తన పిల్లలని కలుసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన బన్నీకి కొడుకు, కూతురు నుంచి ఘన స్వాగతం లభించింది. బన్నీని చూడగానే కొడుకు అల్లు అయాన్, అర్హ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. వెళ్లి తమ తండ్రిని హగ్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతటి స్టార్ హీరో అయినా.. తన పిల్లలని గట్టిగా హగ్ చేసుకుని బన్నీ చిన్న పిల్లాడిలా ఫ్లోర్ పై దొర్లడం చూసిన ఫ్యాన్స్ ఆనందానికి గురి అయ్యాడు. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప మూవీని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే.