టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ఫ భారీ విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతూ.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. పుష్ప ఫీవర్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంది. ఈ సెగ నార్తిండియాకు బాగానే తాకినట్లు అనిపిస్తుంది. ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్ జడేజా కూడా పుష్ప సినిమాలోని డైలాగ్‌తో అదరగొట్టాడు. సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం డైలాగ్ ‘తగ్గేదేలే’ ను అచ్చం అల్లు అర్జున్ చెప్పినట్లే దించేశాడు.
జడేజా పుష్ప డైలాగ్ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. కాగా ఇంతకు ముందు అల్లు అర్జున్ డైలాగులను, పాటలను ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ ఇమిటేట్ చేసేవాడు. ఇప్పుడు ఒక టీమిండియా ఆటగాడు అల్లు అర్జున్ డైలాగ్‌ను చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి జడేజా పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మాటిస్తున్నాను.. పుష్ప-2 అంతకు మించి ఉంటుంది
Cricketer @imjadeja #ThaggedheLe 🤙🤙🤙🤙#Pushpa Mania All Over 🔥🔥🔥🔥#PushpaTheRiseOnDec17th #PushpaTheRise #PushpaTheRule #Rashmika #rashmikamandanna #AlluArjun #IconStar #IconStarAlluArjun pic.twitter.com/ijpvJjm3IV
— Suman TV (@SumanTvOfficial) December 23, 2021