అక్షయ్‌కుమార్‌ ఇంట తీవ్ర విషాదం

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తల్లి అరుణ భాటియా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనోరోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్‌ కుమార్ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Akshay Kumar Mother Died - Suman TVఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.’ఆమె నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నా తల్లి ఈ లోకంలో లేదనే విషయం నాకు చాలా బాధను కలిగిస్తుంది. మా అమ్మ అరుణ భాటియా ఈరోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వేరే లోకంలో ఉన్న మా నాన్నను ఆమె కలువనున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి’ అంటూ ట్వీట్‌ చేశారు. బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.