విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో ఒక సెల్ఫ్ ప్రమోటెడ్ యంగ్ హీరో అనే చెప్పాలి. ఆ మాట ఆ హీరో నోటే చాలాసార్లు విన్నాం. ‘నన్ను ఎవరు లేపలేదు.. నన్ను నేనే ఎత్తుకున్నా’ అని చాలా సందర్భాల్లో విశ్వక్ ప్రస్తావిచడం చూశాం. ప్రస్తుతం విశ్వక్ సేన్ అశోక వననంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఒక కుర్రాడికి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే అతని పరిస్థితి ఏంటి అనే లైన్ తో ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం విశ్వక్ చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అలా ఒక కొత్త కాన్సెప్ట్ తో చేసిన ప్రమోషన్ ఒకటి ఇప్పుడు విశ్వక్ మెడకు చుట్టుకుంది. ఆ ప్రమోషన్ వీడియోపై అడ్వకేట్ ఒకరు హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
ఇదీ చదవండి: సినీ కార్మికులను ఆదుకున్న దేవుడు చిరంజీవి: మంత్రి మల్లారెడ్డి
విషయం ఏంటంటే.. విశ్వక్ సేన్ కారులో వెళ్తుండగా ఫిలింనగర్ లో ఓ కుర్రాడు కారుకు అడ్డంగా పడుకుంటాడు. కారులో నుంచి దిగి విశ్వక్ ఏంటని ప్రశ్నించగా.. బ్రో అల్లం అర్జున్ కుమార్(సినిమాలో విశ్వక్ పాత్ర పేరు)ను కలవాలంటూ డిమాండ్ చేస్తాడు. 33 ఏళ్లు వచ్చినా కూడా అర్జున్ కుమార్ కు పెళ్లి కావడంలేదు. నేను తట్టుకోలేకపోతున్నా నేను పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకుంటా అంటూ ఆ యువకుడు నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ ప్రాంక్ అని అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ, ప్రమేషన్స్ కోసం ఇలా నడిరోడ్డులో న్యూసెన్స్ చేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా ఇదేం ప్రమోషన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమోషన్ ప్రాంక్ వీడియో విషయమై హీరో విశ్వక్ పై అడ్వకేట్ అరుణ్ కుమార్ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రమోషన్ పేరుతో ఇలా రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో కోరారు. అడ్వకేట్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. ప్రస్తుతం విశ్వక్ సేన్, అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా బృందం చేసిన ఆ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.