ఒక్క ‘సమరం’ సినిమాతో సంపాదించింది అంతా అప్పులు తీర్చడానికే.. రోజా కన్నీరు

‘ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌’, డాషింగ్‌ రాజకీయనాయకురాలు ఈ పేర్లు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు బ్యూటీ క్వీన్‌ రోజా. అటు రాజకీయంతో ప్రజల కష్టాలు తీర్చడం, ఇటు బుల్లితెరతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు రోజా. ఆవిడ గుర్తురాగానే ఆవిడకేంరా.. బాబు రెండు చేతులా సంపాదిస్తున్నారుగా అంటారు. కానీ, ఆవిడ జీవితం ఏమీ పూలబాట కాదు. ఈ స్థాయికి రావడానికి ఆవిడ జీవితంలో పడిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ఎవరో చెప్పట్లే ఆవిడ పడిన కష్టాలను ‘ఊరిలో వినాయకుడు’ అనే షోలో చెప్పుకుని కన్నీటిపర్యతం అయ్యారు రోజా. మొదటి నుంచి మంచి ఆఫర్లు వచ్చాయిగా.. ఏం కష్టాలు పడ్డారు అని అనుకుంటారు అందరూ.

roja familyమొదటి నుంచి తింటానికి, ఉండటానికి ఎలాంటి లోటు లేకుండానే ఉన్నారు. రోజా వాళ్ల తండ్రికి సినిమాలు తీయడం అంటే ఇష్టం. అలా సినిమాలు తీస్తూ ఉన్న ఆస్తులన్నీ పోగొట్టేశారు. రోజాని హీరోయిన్‌గా పరిచయం చేసింది ఆవిడ తండ్రే. ‘డ్యాన్స్‌ రాదు, డైలాగ్స్‌ రావు ఈవిడని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారని అందరూ అన్నారు. నన్ను నేను ఎలాగైనా నిరూపించుకోవాలని మా నాన్నతో చెన్నై వెళ్లి ఫొటో షూట్‌ చేశాం. నాకు సెల్వమణి తెరకెక్కించిన ‘చామంతి’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఇక, కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు’ అంటూ రోజా చొప్పుకొచ్చారు.

roja movieసెల్వమణిని వివాహమాడే ముందు సోదరులను సెటిల్‌ చేద్దాం అని ‘సమరం’ సినిమా తీసినట్లు రోజా తెలిపారు. ‘అదేంటో అప్పటినుంచి మా జీవితం అంతా ఆ టైటిల్‌ లాగానే తయారైంది. ఆ సినిమాకి చేసిన అప్పులు తీర్చడానికి నేను 2002 వరకు కష్టపడ్డాను. సినిమాలు, రాజకీయాలు, షోలు అంటూ అందరూ మాట్లాడుతుంటారు. టీవీ షోలు చేసేది నేను నా కుటుంబం కోసం చేస్తాను. అదికూడా అర్థంకాకుండా మాట్లాడుతుంటారు’ అంటూ రోజా భావోద్వోగానికి గురయ్యారు. ఆవిడ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ‘మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు.. నీకు సాయం చేసిన వారిని మర్చిపోయినా గానీ, నిన్ను ఎగతాళి చేసిన వారిని మర్చిపోవద్దు. వారి వల్లే నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు’ అని చెప్తుండే వారని గుర్తు చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్‌ అవుతోంది.