అతన్ని ప్రేమించి తప్పు చేశా! సీరియల్ నటి నవ్యస్వామి సంచలన కామెంట్స్!

నవ్యస్వామి.. ఈ పేరు చెప్తే ఎక్కువ మంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ.., నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి అంటే తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు నవ్యస్వామిని అంతలా ఓన్ చేసేసుకున్నారు. నవ్యస్వామి గత 6 ఏళ్లుగా తెలుగు సీరియల్స్ తో బిజీగా ఉంటోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆమె మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. నవ్య ఈ నేపథ్యంలోనే… ఆలీ హోస్ట్ గా చేస్తున్న ప్రముఖ టాక్ షోలో గెస్ట్ గా పాల్గొంది. అయితే.., ఈ షో ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతగా నవ్యస్వామి ఈ ప్రోమోలో ఎలాంటి నిజాలను బయట పెట్టిందో ఇప్పుడు చూద్దాం. నా పేరు మీనాక్షి సీరియల్లో తనకు అక్కగా నటించిన అమ్మాయినే తన అన్న పెళ్లి చేసుకున్నారని, దానికి మధ్యవర్తిత్వం వహించింది కూడా తానేనని నవ్యస్వామి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక టీవీ ఇండస్ట్రీలో కరోనా వచ్చింది మొదటగా తనకేనని, ఆ సమయంలో ఎన్నో బాధలు పడ్డానని, అప్పుడు తనకంటూ ఎవ్వరూ తోడు లేరు అనిపించిందని నవ్యస్వామి కన్నీరు పెట్టేసింది. ఇక ఈ బ్యూటిఫుల్ యాక్టర్స్ ప్రేమ విషయంలో కూడా ఓపెన్ గా మాట్లాడేసింది. గతంలో ప్రేమలో విఫలమయ్యానని, వర్కవుట్ కాక బ్రేకప్ అయిపోయిందని అన్నారు. తనకి కోపం ఎక్కువ అని.., ఈ కారణంగానే ఒక ఈవెంట్ మేనెజర్ను చితక బాదానని, చచ్చాడో బతికి ఉన్నాడో కూడా తెలీదని, నవ్యస్వామి తెలిపారు. ఇక.. ఆహ్వానం, నా పేరు మీనాక్షి వంటి సీరియళ్లతో నవ్యస్వామి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆమె కథ సీరియల్తో ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె కథ సీరియల్లో రవికృష్ణ, నవ్యస్వామి జంట మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.., వీరిద్దరూ రీల్ లైఫ్ లోనే కాదు.., రియల్ లైఫ్ లో కూడా ఒక్కటి కాబోతున్నారన్న వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ.., నవ్యస్వామి మాత్రం రవి తనకి ఓ మంచి ఫ్రెండ్ మాత్రమే అని ఈ విషయంలో కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి రవి, నవ్యస్వామి రియల్ లైఫ్ లో కూడా ఒక్కటి కావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.