నరేశ్, కరాటే కల్యాణిలపై ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు!

ఈ మద్య టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ‘మా’ ఎన్నికల విషయంపైనే చర్చ నడుస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాంటే సాధారణ ఎన్నికల్లో రాజకీయ నేతలు ఎలాంటి హీట్ పుట్టిస్తారో.. అంతకన్నా ఎక్కువగానే నటీనటులు ఎదుటివారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులైనా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా వారికి చేతనైన రేంజిలో ఓట్లు దండుకునేపనిలో ఉన్నారు.

mage min 3మంగళవారం ప్రకాష్ రాజ్ పోస్టల్ బ్యాలెట్లలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రెస్ మీట్ పెడితే.. ఓడిపోతామనే భయంతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంచు విష్ణు కౌంటర్ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా నటి హేమ మా అధ్యక్షుడు నరేష్, సభ్యురాలు కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. తనను అసభ్యకరంగా మాట్లాడుతూ నరేష్, కళ్యాణి ఓ వీడియో విడుదల చేశారని.. హేమ ఫిర్యాదులో పేర్కొంది. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, సోషల్ మీడియా లింక్ ను కూడా ఎన్నికల అధికారికి పంపారు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో నరేశ్, కరాటే కల్యాణిలు ఓటు వేయకుండా నిషేధం విధించాలని కోరారు.

గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత ఇలాంటి ఘటనలు తగ్గాయని.. ఇప్పుడు మళ్ళీ అదే తరహా ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల అధికారి తక్షణమే స్పందించి ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరింది. నన్ను అగౌరవ పరిచేలా.. నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉందని.. నాపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని కోరుతున్నానని.. మా ఎన్నికల ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాలని కోరారు. తనపై నరేశ్‌, కళ్యాణిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా ఆయా యూట్యూబ్‌ యాజమాన్యాల పైనా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హేమ పేర్కొంది.