సాయి ధరమ్ తేజ్ ఐసీయూ వీడియో.. నిఖిల్ ఫైర్!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తొలుత ఆయనను మెడికవర్ ఆసుపత్రికి, ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాగా… వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

sagas minఅయితే సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థి విషయంపై ఎప్పటికప్పుడు ఆసుపత్రి వర్గం వారు ఓ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సాయి ధరమ్ ఐసీయూలో ఉండగా స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్లు యత్నిస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఓ డాక్టర్ భుజం తడుతుంటే… సాయితేజ్ కాస్త చేయి కదిపాడు. ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ కాస్త ఊరట చెందినా.. తర్వాత దీనిపై కొంత మంది విమర్శలు చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగాఈ వీడియోపై హీరో నిఖిల్ మండిపడ్డాడు. వీడియో బయటకు రావడంపై అసహనం వ్యక్తం చేశాడు.

చికిత్స పొందుతున్న సాయితేజ్ వీడియో ఇలా బయటకు రావడం బాధాకరమని అన్నాడు. అసలు ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతిస్తున్నారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. వ్యక్తి ప్రైవసీకి గౌరవాన్ని ఇవ్వాలని… కనీసం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఏకాంతానికైనా గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, ఆ వీడియోలో సాయి ధరమ్ తేజ్ కళ్లు తెరవలేని పరిస్థితిలో.. కేవలం చేతులు ఊపడం.. హృదయవిదారకంగా కనిపిస్తుంది.. దాంతో చాలామంది మెగా ఫ్యాన్స్.. సాయిధరమ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.