మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్న నటుడు కమల్ హాసన్!

kamal hassan

ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసల్ మరో ప్రయోగానికి తెర తీస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అటు నటుడు గానే కాకుండా ఇటు దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణిస్తూ దక్షిణ సినిమా ఇండస్ట్రీలో మల్టీటాలెంటెడ్ గా ఎదిగాడీ అగ్రకథానాయకుడు. ఇక తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ నిర్మాణంలో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రానుందట. ఇప్పుడు ఇదే వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది.

kamal hassanరాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అనేక సినిమాలు చేసిన కమల్ హాసన్ త్వరలో ఓ ప్రముఖ నటులతో మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్నారట. అయితే కమల్ నిర్మాణంలోని రాబోయే ఈ భారీ మల్టీస్టారర్ లో దక్షిణాది నటులైన విక్రమ్, విజయ్ సేతుపతి నటించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విక్రమ్, విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు. మరి నిజంగానే కమల్ నిర్మాణంలో ఈ ప్రముఖ నటులు నటించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ మల్టీస్టారర్ సినిమాకి దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా తెలియదు. ఇక వీటన్నిటికీ కూడా సమాధానాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతే వరకు వెయిట్ చేయాల్సిందే.