‘ఆచార్య’ లొకేషన్‌ షిఫ్ట్‌…ఛలో కాకినాడ !

హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ‘ఆచార్య’ లొకేషన్‌ షిఫ్ట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను కాకినాడలో ప్లాన్‌ చేశారని మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది.

మూడు నుంచి ఐదు రోజులు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా చిరంజీవి, సోనూసూద్‌ కాంబినేషన్‌లో సీన్స్‌ తెరకెక్కిస్తారట. ఇదిలా ఉంటే… చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్‌’గా తెలుగులో రీమేక్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్‌’, ‘ఫిల్మ్‌ మేకర్‌’ వంటి టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట.

acharya compressed

ఈ చిత్రం మధ్య వయస్కుడైన నక్సలైట్ మారిన సామాజిక సంస్కర్త చుట్టూ తిరుగుతుంది, అతను ఆలయ నిధులు మరియు విరాళాలను దుర్వినియోగం చేయడం మరియు అపహరించడంపై ఎండోమెంట్స్ విభాగానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. సురేఖా కొణిదెల సమర్పించిన ఈ చిత్రాన్ని చరణ్ మరియు నిరంజన్ రెడ్డిలు తమ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ క్రింద నిర్మిస్తున్నారు .