కరోనా కలకలంలో కోలీవుడ్ కి కలిగించే నష్టం ఎంత?

కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉతృతి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు సినీ, టీవీ షూటింగులు జరపబోమని కార్మికులను సినీతారలు ఆదుకోవాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి పేర్కొన్నారు. కరోనా రెండో దశ అతి భయంకరంగా మారడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు ఆంక్షలు అమలు చేస్తుంది. దీంతో సినిమా పరిశ్రమ మరోసారి కష్టాల్లో పడింది సెల్వమణి వీడియా సమావేశంతో తెలిపారు. ప్రస్తుతం 18 సీరియళ్ల షూటింగులు జరుగుతున్నాయి. వాటిని ఆదివారం నుంచి నిలిపి వేస్తున్నాం. కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖ నటీనటులు ఆర్థిక సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ స్తంభించి పోయింది. కోలీవుడ్ విష‌యానికి వ‌స్తే, కోలుకోలేని విధంగా నష్టపోయింది. 2020 మార్చి నుంచి ప్రారంభమైన ఈ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ యేడాది జనవరి ప్రారంభం నుంచి పరిస్థితులు కాస్త చక్కబడ్డాయని భావించారు. కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి మళ్ళీ స్తంభింపజేసింది.

932781 whatsapp image 2020 10 21 at 6.48.41 pm

కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో ఇప్పటికే షూటింగులన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అనుమతిచ్చేంత వరకు మళ్ళీ షూటింగులు ప్రారంభించేది లేదని తేల్చి చెప్పింది. కోలీవుడ్‌ అగ్రహీరోలు రజనీ కాంత్‌ నటించే ‘అన్నాత్త’, అజిత్‌ నటిస్తున్న ‘వలిమై’, విజయ్‌, చియాన్‌ విక్రమ్‌, కమల్‌హాసన్‌, సూర్య, విజయ్‌ సేతుపతి, ధనుష్‌, శివకార్తికేయన్‌, విశాల్‌ ఇలా టాప్‌ హీరోలతో పాటు అనేక మంది చిన్న హీరోల అనేక చిత్రాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టుల విలువ దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇదే విషయంపై తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ, సినిమాలు, టీవీ షూటింగులకు అనుమతివ్వాలని రాష్ట్ర సినిమాటోగ్రాఫర్‌ మంత్రిని స్వయంగా కలిసి విఙ్ఞప్తి చేయడం జరిగింది. కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారనీ, అందువల్ల షూటింగులను అనుమతివ్వలేమని చెప్పారన్నారు. సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతిచ్చినపక్షంలోనే మళ్ళీ షూటింగులు పునఃప్రారంభమవుతాయని ఆయన వివరించారు.