30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ హీరోయిన్ అనన్య బయోగ్రఫీ!

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారా? అయితే.., ఈ మధ్య కాలంలో ఓ పేరు మీకు బాగా వినిపిస్తుంటుంది. ఆ పేరే అనన్య.. 30 వెడ్స్ 21 వేవ్ సిరీస్ లో ఈమె మేఘన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం యూట్యూబ్ ఓ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. దీనంతటికి కారణం కూడా అనన్య అందం. ఆమె యాక్టింగ్. ముఖ్యంగా ఆమె స్మైల్. చూడగానే.. యువతన ఆకట్టుకునే ఆమె కళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత అందం ఒక్కసారిగా ఎక్కడ నుండి దూసుకొచ్చింది? అసలు ఎవరీ అనన్య అని చాలా మంది సోషల్ మీడియాలో ఆమె ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నారు. సో.. కాబట్టి ఇప్పుడు అనన్య లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. అనన్య పక్కా హైదరాబాద్ పోరీ. 2001 వ సంవత్సరం మే 6 న అనన్య జన్మించింది. చదువు అంతా హైదరాబాద్ లోనే సాగింది. ఇక ఆమె దిల్ షుక్ నగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. బుక్ రీడింగ్, మ్యూజిక్ అంటే అనన్యకి చాలా ఇష్టం. అనన్య ముందుగా టిక్ టాక్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమె ఏ వీడియో చేసినా లక్షల్లో వ్యూస్ వచ్చేవి. దీనితో ఆమె మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కూడా అందుకుంది.

ananya 2కట్ చేస్తే టిక్ టాక్ బ్యాన్ అయ్యింది. అప్పటి నుండి ఇన్ స్టాలో పోస్టింగ్ పెట్టడం స్టార్ట్ చేసింది అనన్య. ఇక్కడ కూడా ఈ అమ్మాయికి భారీగా రీచ్ వచ్చింది. దీనితో ఈమెని వెతుక్కుంటూ షార్ట్ ఫిలిమ్స్ అవకాశాలు వచ్చాయి . ఇందులో భాగంగానే ప్రముఖ వెబ్ ఛానెల్ లో .. బ్రదర్ అండ్ సిస్టర్ టేల్స్, ఫ్లాట్ మేట్స్, మా బతుకమ్మ, జాతి రత్నాలు అమ్మాయిలైతే, కరోనా బ్యాచ్ 2020 వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్నిట్లో అనన్యకి మంచి పేరు వచ్చింది. వీటి కారణంగానే ఆ అమ్మాయికి 30 వెడ్స్ 21 షార్ట్ ఫిలిం లో అవకాశం వచ్చింది. ఇక అనన్య వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఈమెకి అనాధ పిల్లలు అంటే చాలా ఇష్టం. తన సంపాదనలో చాలా భాగం అనాధ శరణాయలకి ఖర్చు చేస్తా ఉంటుంది. ఇక కాలేజీలో ఉండగానే అనన్య ప్రేమలో పడింది. కానీ.., కారణాలు తెలియవు గాని.., ఆ లవ్ ఇప్పుడు బ్రేక్ అప్ అయిపొయింది. కానీ.., అనన్య కోరుకున్నట్టు ఇప్పుడు పెద్ద స్టార్ మాత్రం అయిపొయింది. ఈ 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తర్వాత అనన్య వెబ్ సిరీస్ లు , షార్ట్ ఫిలిమ్స్ ఆపేసి హీరోయిన్ గా సినిమాలు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎలాగో మనకి తెలుగు హీరోయిన్స్ తక్కువ. కాబట్టి అనన్యకి అవకాశాలు ఇవ్వాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. మరి.. మీరేం అనుకుంటున్నారు? అనన్య హీరోయిన్ అవుతుందా? మీ అభిప్రాయలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.