మా ఆవిడ శ్యామల చెప్పింది నిజం.. నేను అమాయకున్ని మీకే తెలుస్తుంది

freepressjournal 2021 04 c9e0cb3f 1f5a 4612 bf97 d0265c80cdf2 shayala

హైదరాబాద్- ప్రముఖ బుూల్లితెర యాంకర్‌, సినిమా నటి శ్యామల భర్త, నరసింహా రెడ్డిని రాయదుర్గం పోలీసులు చీటింగ్‌ కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేశారు కదా. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడని నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ చేసిన ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నరసింహా రెడ్డి, తన అరెస్ట్‌కు సంబంధించి క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. యాంకర్ శ్యామల ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. నాపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.. అయితే నాపై వచ్చిన మోసపూరిత ఆరోపణలను నమ్మకుండా నాకు అండగా నిలిచిన వారందరికీ థాంక్స్‌.. నా కేసుకు సంబంధించిన వివరాలు, వాటిని ఎలా తప్పుదోవ పట్టించారు అనే వివరాలతో, తగిన ఆధారాలతో మీ ముందుకు వస్తాను.. నేను రెండు రోజుల్లోనే బయటకు రావడం అనేది ఇదొక తప్పుడు కేసు అనడానికి నిరూపణ.. కొన్నిసార్లు నిందలను భరించాలి.. అయితే పుకార్లకు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది.. అని వీడియోలో లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. శ్యామల కూడా తన భర్త అమాయకుడు, నిర్ధోషి అని చెబుతోంది. చివరకు ఏంజరుగుతుందో చూడాలి మరి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here