ఒక మినీ కథకి 5 కోట్లు లాభం!..

ఏయూవీ క్రియేష‌న్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వ‌ర‌కూ ద‌ర్శకుడు చెప్పిన క‌థ‌ని న‌మ్మి మార్కెట్‌‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి, మ‌రో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో క‌లిసి ప్రేక్షకుడి వినోదాన్ని డబుల్ చేయబోతున్నారు. ‘ఏక్ మినీ కథ’ చిత్ర ఫస్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ‘Does Size Matter’ అంటూ పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏక్ మినీ కథ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Santosh Shoban Ek Mini Katha song launch 1200x900 3

08842654 1fc0 44ff 9d63 c1e4cc9968a3

పేప‌ర్ బాయ్ ఫేమ్ సంతోశ్ శోభ‌న్ హీరోగా, కార్తీక్ రాపోలు ద‌ర్శ‌క‌త్వంలో ఏక్ మినీ క‌థ సినిమా తెర‌కెక్కింది. యువీ సంస్థ నిర్మించిన ఈ చిన్న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు చాలా ప్రయత్నించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నా క‌రోనా కార‌ణంగా కుద‌ర్లేదు. దీంతో ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. అడల్ట్ టచ్ కామెడీ మూవీ కావడంతో అమెజాన్‌ కూడా మంచి రేటుకే కొనేందుకు ముందుకు వచ్చిందట. రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 9 కోట్లకు బేరం కుదరడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏదేమైనా ఈ సినిమాకు క‌నీసం 5 కోట్లు మిగులుతున్నాయి.