అనుపమపై పవన్ ఫ్యాన్స్ ఫైర్, సారి చెప్పిన కేరళ కుట్టి

1146428
Anupama parameshwaran

ఫిల్మ్ డెస్క్- మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనుపమా పరమేశ్వరన్ బాగానే క్లిక్ అయ్యింది. తెలుగుతో పాటు దక్షిణాది బాషలన్నింటిలో నటిస్తోంది అను. ఇక తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ..ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. నాగచైతన్యతో ప్రేమమ్, ఆ తర్వాత శర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది అనుపమా పరమేశ్వరన్. ఐతే ఆ తర్వాత పెద్దగా హిట్స్ లేకపోవడంతో కాస్త చతికిలపడిపోయింది. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో ఎక్కవగా తన సొంత ప్రాంతమైన కేరళలోనే ఉంటోంది అనుపమ.

Anupama parameswaran new HD photo 01
Actress Anupama

అప్పుడప్పుడ హాట్ ఫోటో షూట్లు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అసలు విషయానికి వస్తే.. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చూసింది అనుపమ. ఆ తరువాత తనకు సినిమా బాగా నచ్చిందని ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించారని చెబుతూనే ముగ్గురు లేడీస్ కూడా బాగా నటించారని చెప్పుకొచ్చింది. ఇక ప్రకాష్ రాజ్ సర్ లేకపోతే ఈ సినిమా అసంపూర్తిగా ఉండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

anupama parameswaran wallpaper preview
anupama parameshwaran

ఐతే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ప్రకాష్ రాజ్ ని సార్ అని సంబోధించిన అనుపమ, పవన్ కళ్యాణ్ ను సార్ అని సంబోధించక పోవడంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇంకేముంది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధికగా ఫైర్ అయ్యారు. అంతలోనే తెరుకుని తన తప్పు తెలుసుకున్న అనుపమ సారీ చెబుతూ ట్విట్టర్ లో మరో పోస్ట్ పేట్టింది. తన తప్పు తెలిసిందని, తనను క్షమించాలని కోరింది. అనుపమా పరమేశ్వరన్ సారీ చెప్పడంతో కూల్ అయిన పవన్ ఫ్యాన్స్ పెద్దవాళ్ళ గురించి మాట్లాడేప్పుడు గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలని హితువు పలికి ఈ వివాదానికి తెరదింపారు..