తిమింగలం విసర్జించే విలువైన పదార్ధం దొరికితే జాక్ పాట్… వీళ్ళకి దొరికింది!..

చైనా, జపాన్, ఆఫ్రికా మరియు అమెరికా తీరాలలో మరియు బహామాస్ వంటి ఉష్ణమండల ద్వీపాలలో అంబర్‌గ్రిస్ చాలా తరచుగా తేలుతూ, ఒడ్డుకు కడుగుతుంది. స్పెర్మ్ వేల్ జీర్ణవ్యవస్థలో ఓ స్రావం మైనపు ముద్దగా విసర్ణించబడుతుంది. దీన్నే అంబర్‌గ్రిస్ అంటారు. ఉష్ణ మండల సముద్రాల్లో లభిస్తుంది. ఇది అత్యంత విలువైన పదార్థం. సుగంధ పరిమాళాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆల్కాహాల్, క్లోరోఫాం, కొన్ని రకాల నూనెల్లో ఇది కరుగుతుంది. ఇదంతా ఎందుకూ అంటే – చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన జాలర్ల గుంపుకి జాక్​పాట్ తగిలింది. చనిపోయిన ఓ భారీ తిమింగలం కడుపు నుంచి విలువైన వస్తువును వెలికి తీశారు. దీంతో అది వాళ్ల తలరాతనే మార్చేసింది. అల్-ఖైసా గ్రామానికి చెందిన కొందరు జాలర్లకు గల్ఫ్​ ఆడెన్​ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. ఆ టైంలో చచ్చిన భారీ తిమింగలం కళేబరం సముద్రంపైన తేలుతూ కనిపించింది. వెంటనే 35 మంది జాలర్లు ఆ కళేబరాన్ని అతికష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. చివరికి దాన్ని చీల్చగా అత్యంత విలువైన అంబర్గ్రిస్ బయటపడింది.

ea98f03dcdcfc22eea86971365061a50తిమింగలం జీర్ణించుకోలేని వాటిని కడుపులో ఘన పదార్థంగా మైనపు పదార్థం రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. ఒక్కోసారి వాంతి రూపంలో వెలువడి నీళ్లలో తేలుతుంది. లేదంటే చనిపోయాక దాని కడుపు నుంచి అంబర్గ్రిస్​ బయటకు వస్తుంది. దీనిని సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టే భారీ డిమాండ్​ ఉంటుంది. ఇ యెమెన్​ జాలర్లకు స్పెర్మ్​ వేల్ కడుపులో 127కేజీల బరువు అంబర్గ్రిస్​ కనిపించింది. అది విలువైందని వాళ్లకు తెలుసు. కాబట్టి ఓ దుబాయ్​ డీలర్​ సాయంతో మార్కెట్​లో దాన్ని అమ్మేశారు. అంబర్గ్రిస్​ అమ్మేయగా సుమారు రూ.10కోట్లు సొమ్ము వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సొమ్మును ఆ 35 మంది పంచుకోవడంతోనే ఆపకుండా తమ కమ్యూనిటీలోని మరికొందరికి ఆర్థిక సాయం చేశారు. ఊరును బాగు చేసుకున్నారు కూడా. ఇక సువాసన వెదజల్లే అంబర్గ్రిస్​కి చైనా, జపాన్, ఆఫ్రికా, అమెరికా, గ‌ల్ప్ దేశాల‌ ప‌ముద్ర‌ తీరాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆ జనవరిలో థాయ్​లాండ్​లో 20 ఏళ్ల ఓ కుర్రాడికి అంబర్గ్రిస్​ ముద్ద దొరకడంతో కోటీశ్వరుడు అయ్యాడు.