అది – పది అంతస్థుల భవనం… 28 గంటల్లో కట్టేసారు!..

బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ గీయాలి… ఎస్టిమేషన్ వెయ్యాలి…ఇటుకలు,సిమ్మెంట్ ఇనుము ఇలా ఎన్నో కొనాలి. ఇవన్నీ ఒకెత్తు. కట్టాలంటే ఎంతమంది కూలీలూ మేస్త్రీలు కావాలి. ఇల్లు కట్టి చూడు అన్నారు అందుకే. అందులో ఎన్నో సాధకబాధకాలు. అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కడుతున్నాం. అయితే ఇందులో వేగం పెరిగింది. అదీ రికార్డ్ స్థాయిలో. ఏకంగా 10 మనుషులు నివసించే 10 అంతస్థుల భవనాన్ని చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్‌ గ్రూప్‌ కంపెనీ తేలికగా కేవలం 28 గంటల్లో నిర్మించింది. కరెంట్‌, వాటర్‌ కనెక్షన్లను కూడా ఇచ్చింది. రికార్డ్‌ సృష్టించింది. ఈ పది అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం కోసం బ్రాడ్‌ కంపెనీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించింది.

China Building.jpg02 minఫ్యాక్టరీలో ముందుగానే నిర్మించిన చిన్న విభాగాల ద్వారా నిర్మాణం పూర్తి చేసింది. ఈ 10 అంతస్తుల భవనం నిర్మాణం కోసం ముందుగానే నిర్మించిన కంటైనర్‌ సైజ్‌ బ్లాక్స్‌ను తీసుకువచ్చి వాటన్నింటిని ఒకదాని మీద ఒకటి పేర్చారు. బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత బోల్ట్స్‌ బిగించి వాటర్‌, కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఇక ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.