మధర్స్ డే స్పెషల్- మా పిల్లలు బంగారం అంటున్న నమ్రత

ఫిల్మ్ డస్క్- ఈ రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తన పిల్లలు సితార, గౌతమ్ ల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఇంటిని, వాళ్ల వ్యాపారాలను నమ్రత జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇక మహేష్ సినిమాలు లేనప్పుడు వైఫ్ నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో జాలీగా వెకేషన్స్ కు వెళ్లిపోతారు. పిల్లలతో సరదాగా వేసిన ట్రిప్స్, అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు మహేష్ అండ్ నమ్రత. ఇక మధర్స్ డే సందర్బంగా పలు అంశాలను వెల్లడించారు నమ్రత. పిల్లల కోసం తాను పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పారు నమ్రత.

thumb 1 1
mahesh babu family

వారి ఇష్టాలను, కోరికలను తీరుస్తూనే.. సందర్బాన్ని బట్టి మంచీ చెడులను వివరిస్తానని తెలిపారు. సాద్యమైనంతవరకు నిరాడంబరంగా, సాదాసీదాగా ఉండమని పిల్లకు చెబుతానంది నమ్రత. ఐతే అందరి పిల్లల్లాగే గౌతమ్, సితార సైతం అదే పనిగా చదువుకోవడానికి ఇష్టపడరని, అందుకే వాళ్లను చదివించేటప్పుడు మాత్రం కాస్త కఠినంగా ఉంటానని చెప్పుకొచ్చారు నమ్రత. అంతే కాదు పిల్లలకు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ముఖ్యమని.. గౌతమ్‌కు స్విమ్మింగ్, సితారకు డ్యాన్స్‌ అంటే ఇష్టమని, ఆటలతో వాల్లు బాగా రిలాక్స్ అవుతారని చెప్పారు. తన ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్ లు బంగారం అంటూ మురిసిపోయిన నమ్రత, వాళ్లను మ్యానేజ్‌ చేయడం తనకెప్పుడూ కష్టంగా అనిపించలేదని అంది. పిల్లలతో ఉంటే అసలు సమయమే తెలియదని.. వాళ్లే మా లోకం అని చెప్పుకొచ్చారు నమ్రత.