అభివృద్ధికి సవాలే సోపానాలు… వినీతాగుప్తా.

యాభై ఏళ్ల క్రితం మాట. దేశ్‌బంధుగుప్తా బిట్స్‌ పిలానీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. అప్పటికి మనదేశంలో క్షయ తీవ్రంగా ఉండేది. పాఠాలు చెబుతూ నాలుగ్గోడలకి పరిమితం అవకుండా   తన పరిశోధనలతో ప్రజల ప్రాణాలని కాపాడాలనుకున్నాడాయన. అందుకే భార్య మంజు దాచుకున్న ఐదువేల రూపాయల్ని అడిగి తీసుకుని ‘లూపిన్‌’ పేరుతో క్షయ వ్యాధి నివారణ మందుల తయారీ చేపట్టారు. నాణ్యతలో రాజీపడని ఆ సంస్థ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. దేశ్‌బంధు లక్ష్యం కూడా అదే కావడంతో ఆయన అంతకు మించి పెద్దగా ఆశించలేదు. అదే సమయంలో బాంబే కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో డిగ్రీ చదువుతున్న వినీతాగుప్తా లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. ఏమీ లేనిచోట ఆముదం చెట్టులా ఎదగడం ఆమెకి ఇష్టం లేదు. పోటీపడితే అంతర్జాతీయ సంస్థలతోనే అనేది తన లక్ష్యం. చ ఔరంగాబాద్‌లో ఉన్న లూపిన్‌ సంస్థ పరిశోధన, మార్కెటింగ్‌ విభాగాల్లో పనిచేయడం మొదలుపెట్టింది. అందుకే డిగ్రీ అయిపోగానే అమెరికాలోని కెలాగ్‌స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివింది. అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం అబాట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేస్తూ ప్రపంచ ఫార్మా మార్కెట్‌ విస్తరణ అవకాశాల గురించి లోతుగా తెలుసుకుంది.

3 Inner

ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత అమెరికాలో ఫార్మా సంస్థని పెట్టాలన్న ఆలోచనని తండ్రితో పంచుకుంది. అందుకు ఆయన అంగీకరించలేదు. పక్కా ప్రణాళికతో అమెరికాలో జనరిక్‌ మందుల తయారీకి తండ్రిని ఒప్పించింది. అక్కడ ప్రముఖ బ్రాండ్లకి జనరిక్‌ మందులని సరఫరా చేసేది. కానీ అక్కడి స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ప్రయాణం అంత సాఫీగా సాగలేదామెకి.  ఆ రోజు టీబీ మందులతో ప్రారంభమైన లూపిన్‌ సంస్థ ఇవాళ క్యాన్సర్‌తో సహా వందలాది ప్రాణాంతక వ్యాధులకి మందులని తయారుచేస్తూ అమెరికాలోనే నాలుగో అతిపెద్ద ఫార్మా సంస్థగా పేరుతెచ్చుకుంది.  అక్కడున్న భారతీయ కంపెనీలన్నీ  పేరున్న సంస్థలకి సరకుని తయారుచేసి ఇస్తాయే కానీ వాటితో పోటీ పడాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రి ఒప్పుకోకపోయినా లూపిన్‌ బ్రాండ్‌తో  మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల నివారణ మందుల తయారీని ధైర్యంగా మొదలుపెట్టింది. ఇవి మార్కెట్‌లోకి వచ్చేలోపు పోటీ సంస్థలు దూసుకుపోయాయి. అయినా కంగారు పడలేదు. నాణ్యతతో రాజీలేకుండా ఔషధాలకు మంచి పేరొచ్చింది. కానీ సంస్థకు అప్పులు కొండలా పేరుకుపోయాయి. ఆ సమస్య నుంచి బయటపడేందుకు పెట్టుబడిదారులని ఒప్పించడం కన్నా తండ్రిని ఒప్పించడానికే ఎక్కువ కష్టపడింది వినీత. ఆ తరువాత అమెరికాలో లూపిన్‌ పేరు మారుమోగింది.