మట్టికుండలో నీరు ఎంతవరకూ ప్రయోజనకరం?..

ఇప్పుడైతే నీటిని నిల్వ చేసుకోవడానికి రకరకాల గాజు పాత్రలు, స్టీలు బిందెలు వచ్చేశాయ్‌ గానీ, ఒకప్పుడు అందరూ మట్టికుండలోనే నీటిని నిల్వచేసే వారనీ, ఆ నీటినే తాగే వారని తెలిసే ఉంటుంది. ఇందులో నిల్వచేసుకుంటే నీరు చల్లగా ఉండటంతోపాటు, పోషకాలు, ఖనిజలవణాలు కూడా వృథా కాకుండా ఉంటాయి. మట్టికుండలో నీటిని పోస్తే అందులోని వెచ్చదనం సూక్ష్మ రంద్రాల ద్వారా బయటకు పోతుంది. నీరు చల్లగా ఉంటాయి. మట్టికుండలో నీటిని తాగితే చాలా మంచిదని, శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి ఉత్సహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Clay pot India Tamil word 7వేసవికాలం వచ్చిందంటే చాలు చల్లని నీటికోసం ప్రిజ్‌వైపు పరిగెడతాం.కానీ, ఫ్రిజ్‌ నీరు కొందరికి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. గొంతులోపల దురదపెట్టడం, దగ్గు, జలుబు తదితర సమస్యలు వచ్చే అవకాశముంది. కానీ, మట్టికుండలో నీటితో ఎలాంటి బాధా లేదు. వెచ్చగా కాకుండా అలా అని మరీ చల్లగా కాకుండా తాగేందుకు వీలుగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారదార్థాలు పొట్టలో కొన్ని రకాల ఆమ్లాలతో కలుస్తాయి. వీటివల్ల టాక్సీన్లు ఉత్పత్తి అయ్యి శరీరానికి హాని కలిగించే అవకాశముంది. మట్టికుండలోని నీటిలో సహజసిద్ధమైన ఆల్కలీన్‌లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి టాక్సీన్లను బయటకు నెట్టివేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని పీహెచ్‌ విలువను స్థిరంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. మట్టి ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం. అలాగే అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎనర్జీ దాగుంటుంది. ఇలాంటి మట్టితో తయారుచేసిన కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.