ఆయుర్వేద ప్రామాణికం – రాగిజలం అమృతతుల్యం.

రాగి పాత్రలో లేదా చెంబులో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వాడుతున్నాం కానీ, పూర్వ కాలంలో రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటినే తాగే వారు. రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రలో నిల్వ చేయబడిన నీటిని సేవించడం, భారతదేశంలో తరతరాలుగా పాటిస్తున్న పురాతన ఆచారం. రాగిపాత్రలో నీటిని నిల్వ చేయడం ద్వారా, క్రమంగా నీటిలోని మలినాలు తొలగి స్వచ్చమైన నీటిని అందిస్తుందని చెప్పబడింది. రాగి నీరు తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

copper water pot 3 litre kitchen utensils

దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం అద్భుత శక్తితో పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది.మన శరీరం రాగిని తయారు చేసుకోలేదు. దీన్ని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. రాగి పాత్రల్లోని నీళ్ళు తాగితే, క్రిములు చేరేఅవకాశం చాలా అరుదు. అందుకే పాతరోజుల్లో రాగిబిందెలు వాడేవాళ్లు. పూర్వం ఆడపిల్లలకు పెళ్లిచేసి అత్తవారింటికి పంపేటప్పుడు ఇత్తడి, కంచు, రాగి సామాన్లు, వంట పాత్రలు, బిందెలు మొదలగు వస్తువులను సారె పెట్టేవారు.

మనదేశంలో ఉన్న పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. మినరల్‌ వాటర్‌వల్ల శరీరంలో ఎముకల చుట్టూ ఉండేకాల్షియం కరిగి పోయి పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. రాగిలో చాలా శక్తివంతంమైన శోథనిరోధక లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యంగా నొప్పులను నివారించ డానికి ఏకారణం చేతైనా కీళ్లవాతంతో పోరడటానికి శక్తివంతంగా సహాయపడుతుంది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గడమే కాకుండా, కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. కిడ్నీ, లివర్ చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారం రాగిని రోజుకు 12మి.గ్రా కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అంటే రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్య సమస్యలున్నవారు రాగి పాత్రల్లో ఆహారం తీసుకుంటే మాత్రం అది టాక్సిసిటీకి దారి తీసి కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఎదురు కావచ్చు. అందువల్ల రాగి పాత్రలను నీళ్లు తాగడానికి పరిమితంచేస్తే మంచిది.