బిగ్‌బాస్ తెలుగు-4 విన్న‌ర్ అభిజిత్ త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌!..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. సామాన్యులు సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక సినిమా తారలు కూడా ఒకరి తరవాత ఒకరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తెలుగులోనూ పలువురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రెటీలతో పాటు వారి కుటుంబ స‌భ్యులు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డ్డారు. తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 విన్న‌ర్ అభిజిత్ త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని అభిజిత్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

Abhijeet bb 1608794992

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 విజేతగా.. అభిజిత్ ఎంతగా ఫేమస్ అయ్యాడో ఆయన తల్లి లక్ష్మి ప్రసన్న కూడా అంతగా ఫేమస్ అయ్యారు. ఆమె బిగ్‌ బాస్ షో లోకి వెళ్లిన సమయంలో కొట్టుకోండి.. తన్నుకోండి.. ఎంజాయ్ చేయండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. నెట్టింట అభిజిత్ తల్లికి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం ఆమె క‌రోనా బారిన ప‌డ‌డంతో.. ఆమె అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు. ఏం జ‌ర‌గ‌కూడ‌ద‌ని అనుకున్నానో అదే జ‌రిగింది. కుటుంబ స‌భ్యులంద‌రికి నెగెటివ్ రాగా.. అమ్మ‌కు పాజిటివ్ అని వ‌చ్చింది. ఊర‌ట నిచ్చే విష‌యం ఏమిటంటే, సీటీ లెవ‌ల్స్ బాగానే ఉన్నాయి. అమ్మ త్వ‌ర‌లోనే కోలుకుంటుంద‌ని ఆశిస్తున్నాను. ఇకపోతే ఈ కోవిడ్‌ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్‌లో బంధించడం అనేది దారుణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వృథాగా పోనీయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా. అలా స్పానిష్‌ నేర్చుకుంటున్నాను” అని అభిజిత్‌ చెప్పుకొచ్చాడు. ఈ విష‌యం తెలిసిన నెటీజ‌న్లు అభిజిత్ త‌ల్లి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.