ఐపీఎల్ 2022లో క్వాలిఫైయర్ 2లో ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ఈసారైనా సొంతం చేసుకుంటుందని అభిమానులు భావించారు. కానీ ఆర్సీబీ ఆటగాళ్ల కీలక మ్యాచ్‌లో విఫలమై తీవ్రంగా నిరాశపరిచారు. 15 ఐపీఎల్ సీజన్లలో కేవలం మూడు సార్లు మాత్రమే ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరింది. 2009, 2011, 2016లో ఆర్సీబీ ఫైనల్ చేరింది. కానీ ఈ సీజన్‌లో ఆర్బీసీ ఎలిమినేటర్‌ను దాటిన క్వాలిఫైయర్‌లో ఓడింది.
ఆర్సీబీ ఓటమిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సీజన్ ఆసాంతం మద్దతుగా నిలిచిన మేనేజ్‌మెంట్‌కు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం, మరి కొన్ని సార్లు సాధించలేం. కానీ అభిమానులు మాత్రం నిరంతరం మాకు మద్దుతగా నిలిచారు. ఈ అద్భుతమైన ఫ్రాంఛైజ్‌లో భాగమైన మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్, అభిమానులందరికీ నా ధన్యవాదాలు. వచ్చే సీజన్‌లో మళ్లీ కలుద్దాం” అని కోహ్లీ ట్వీట్ చేశాడు. భారీ అంచనాలతో ఈ సీజన్ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 16 మ్యాచ్‌లాడి 115.59 స్ట్రైక్‌రేట్‌తో 341 పరుగులే చేశాడు. ఇందులో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. మూడు సార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌ ట్; 10 ఫోర్లు, 6 సిక్స్ లు) సీజన్‌లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. ఆదివారం ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. క్వాలిఫైయర్ 1లో ఇప్పటికే రాజస్థాన్‌ను గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Obed Mccoy: ఆస్పత్రిలో తల్లికి సీరియస్.. ఆ బాధను దిగమింగి మ్యాచ్‌లో అదరగొట్టిన క్రికెటర్!