ఐపీఎల్ 2022 ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఈ లీగ్ తర్వాత టీమిండియా-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేసే పనిలో సెలెక్టర్లు బిజీగా ఉన్నారు. టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం.. ఐపీఎల్‌లో యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తుండంతో ఐపీఎల్ లాంటి లాంగ్ లీగ్ తర్వాత సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని బోర్డు సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే.. ముంబై ఇండియన్స్ తరపున అద్భుతంగా రాణిస్తున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మతోపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న అర్షదీప్ సింగ్‌లకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కడం ఖాయమని సమాచారం. సీనియర్ బౌలర్లలో ఒకరిద్దరికి విశ్రాంతి ఇచ్చి వీరికి అవకాశం ఇవ్వనున్నారు. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరుపున అద్భుతంగా ఆడుతున్నాడు. ఆ జట్టు నుంచి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 368 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లో ముంబై దారుణంగా విఫలం అయినా కూడా తిలక్ వర్మ తన బ్యాటింగ్‌తో అందరిని ఆకర్షించాడు.
ఇక మరో యంగ్ టాలెంట్, జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో ఇండియన్ క్రికెట్ ఎక్కడికో తీసుకెళ్లాడు. ఐపీఎల్ 2022లో అత్యంత వేగవంతమై బంతి ఉమ్రాన్ మాలిక్ వేసిందే. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ 18 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక 5 వికెట్ల హల్, ఒక 4 వికెట్ల హల్ ఉన్నాయి. ఇక మరో సూపర్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ అర్షదీప్ సింగ్.. పంజాబ్ బౌలింగ్ ఎటాక్‌కు కింగ్‌లా మారాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన అర్షదీప్ 10 వికెట్లు తీశాడు. కానీ.. 7.83 ఎకనామీతో బౌలింగ్ చేస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో ఇది చాలా మంచి ఎకనామీ. మరి ఈ ముగ్గురు టీమిండియా ఆడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Warner: దరిద్రం నెత్తి మీద డాన్స్ చేస్తుంటే ఇలానే ఉంటుంది! వార్నర్‌పై సెటైర్ల వర్షం