ఐపీఎల్ 2022లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మిశ్రమ ఫలితాలు సాధిస్తుంది. టోర్నీ ఆరంభంలో మంచి విజయాలు సాధించిన కేకేఆర్.. మూడు విజయాల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి.. ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు 7 పరాజయాలతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. ప్లేఆఫ్స్ కోసం ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాలి. టోర్నీ ఆరంభంలో చాలా బలమైన జట్టుగా కనిపించిన కేకేఆర్.. ప్రస్తుతం ఒక సామన్య జట్టుగానే కనిపిస్తుంది.
ఇంతలా ఆ జట్టు పరిస్థితి మారడానికి కారణం జట్టులో చేసిన మార్పులు.. తుది జట్టు కూర్పులో చేసిన ప్రయోగాలే. ఈ సీజన్‌లో తుది జట్టులో ఎక్కువ మార్పులు చేసిన జట్టు కేకేఆర్ అనడంలో అతిశయోక్తి లేదు. చాలా మ్యాచ్‌ల తర్వాత.. దాదాపు ఒకటి రెండు మార్పులు తప్ప తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే సోమవారం ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ తలపడింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత మాట్లాడిన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన విషయాలు బయటపెట్టాడు. తుది జట్టు కూర్పులో కేకేఆర్ సీఈఓ కూడా జోక్యం చేసుకుంటారని వెల్లడించాడు. ఈ విషయంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.
ఫ్రాంచైజ్ టోర్నీ అయినా కూడా.. జట్టు ఎంపికలో కెప్టెన్, కోచ్ మాత్రమే జోక్యం చేసుకుంటారు. కానీ కేకేఆర్ విషయంలో సీఈఓ కూడా తుది జట్టు విషయంలో జోక్యం చేసుకుంటారని ఏకంగా కెప్టెన్ అనడం తీవ్ర దుమారం రేపుతోంది. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లోనే కేకేఆర్‌కు కొత్త కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్.. ఆ జట్టు రిటేన్ చేసుకోకపోవడంతో వేలంలో అందుబాటులో ఉండటంతో కేకేఆర్ రూ.12.25 కోట్ల ధర చెల్లించి అయ్యర్ సొంతం చేసుకుని, తమ కెప్టెన్‌గా నియమించింది. తొలుత మంచి విజయాలు సాధించడంతో శ్రేయస్ త్వరగానే జట్టును హ్యాండిల్ చేశాడని చెప్పుకున్నారు. కానీ రెండు ఓటములు వస్తే కానీ.. అసలు విషయం శ్రేయస్‌కు అర్థం కాలేదు. కెప్టెన్ గా అతను ఉన్నా.. కూడా తుది జట్టులో భారీ మార్పులు చేశారు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో టోర్నీ ఆరంభంలో ఆడిన జట్టుతోనే మళ్లీ గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ishan Kishan: వీడియో: వెంకటేశ్ అయ్యర్‌ను అవుట్ చేయలేక ఇషాన్ కిషన్ స్లెడ్జింగ్!
After the win over Mumbai Indians on Monday, Kolkata Knight Riders skipper Shreyas Iyer said that the team “CEO is also involved in team selection”#IPL2022 #MIvsKKRhttps://t.co/fA5Ztk57fu
— CricketNDTV (@CricketNDTV) May 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.