ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న రోవ్‌మన్ పావెల్.. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. చిన్నతనం నుంచి తల్లి కష్టంతో కడుపేదరికంలో బతికిన పావెల్.. చాలా చిన్న వయసులోనే ఈ పేదరికం నుంచి తన కుటుంబాన్ని బయటపడేస్తానని తల్లికి మాట ఇచ్చాడు. చదువు లేదా క్రికెట్‌తోనే తమ జీవితాలు మారుతాయని బలంగా విశ్వసించిన పావెల్.. రెండింటిపై శ్రద్ధపెట్టాడు. క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో క్రికెట్‌నే కెరీర్‌గా మల్చుకున్నాడు. వెస్టిండీస్ జట్టుకు ఎంపిక అవ్వడం, ఆ తర్వాత కరేబియన్ లీగ్‌లో ఆడటంతో పావెల్ కుటుంబం ఆర్థికంగా కొంత మెరుగుపడింది.
ఇక ఐపీఎల్ లాంటి మెగా రిచ్ లీగ్‌తో పావెల్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ మెగా వేలంలో పావెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.80 కోట్లకు కొనుగోలు చేసింది. తనపై ఢిల్లీ ఫ్రాంచైజ్ పెట్టుకున్న నమ్మకాన్ని పావెల్ నిలబెట్టుకున్నాడు. డెత్ ఓవర్స్‌లో మంచి హిట్టింగ్ జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాడు. తాజాగా తన జీవిన ప్రయాణంపై స్పందించిన పావెల్.. క్రికెట్‌తో తమ పేదరికాన్ని జయించినట్లు వెల్లడించాడు. చదువు లేదా క్రికెట్‌తోనే పేదరికాన్ని జయించవచ్చని అని నమ్మినట్లు తెలిపాడు. ఒక వేళ నేను క్రికెటర్‌ను కాకపోయి ఉంటే.. సైన్యంలో చేరే వాడిన అని పేర్కొన్నాడు. దేశ సేవతో పాటు తన కుటుంబా కష్టాలు కూడా తీర్చేవాడిని అని అన్నాడు. ఇలా తన తల్లికి ఎప్పుడు చిన్నతనంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పావెల్ జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: బెర్త్ భర్తీ చేసిన కొత్త జట్టు! మిగిలిన 3 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.