ఐపీఎల్ 2022 సీజన్ సమీకరణాలు మారిపోతున్నాయి. ఒక్కో మ్యాచ్ ఫలితం మొత్తం సీజన్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. గుజరాత్ ఇప్పటకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోగా.. మూడు స్థానాల కోసం 8 జట్లు పోటీపడుతున్నాయి. గురువారం జరిగిన ఢిల్లీ Vs హైదరాబాద్ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో 58 బంతుల్లో 92 పరుగులు చేసి వార్నర్ నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లకు డేవిడ్ వార్నర్ చుక్కలు చూపించాడు. అయితే సెంచరీ అయ్యుంటే బాగుండేదని అందరూ భావిస్తున్నారు. అయితే వార్నర్ కు సెంచరీ చేసే అవకాశం ఉండి కూడా చేయలేదు. ఆ విషయాన్ని రోవ్మన్ పోవెల్ స్వయంగా వెల్లడించాడు.
ఇదీ చదవండి: SRHపై విజృంభించిన డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన మీమర్స్..
వార్నర్ 92 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంకో ఓవర్ మిగిలే ఉంది. పోవెల్ 49 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. 18 పరుగుల వద్ద కేన్ విలియమ్సన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో పోవెల్ చేలరేగి బ్యాటింగ్ చేశాడు. ఒక సింగిల్ తీస్తే పోవెల్ కు అర్ధ శతకం పూర్తవుతుంది. స్ట్రైకింగ్ లోకి వార్నర్ వస్తే సెంచరీ చేసుకునేవాడు కదా అని అంతా అనుకున్నారు. కానీ, అలా కాకుండా రోవ్మన్ పోవెల్ విజృభించి బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ బాల్ సిక్స్, మూడో బాల్ ఫోర్, నాలుగో బాల్ ఫోర్, ఐదో బాల్ ఫోర్, లాస్ట్ బాల్ సింగిల్ తీశాడు. ఆఖరి ఓవర్లో 19 పరుగులు స్కోర్ చేశాడు. అలా పోవెల్ 35 బంతుల్లో 67 పరుగులు చేశాడు.
అయితే అందరూ సింగిల్ తీసి వార్నర్ కు స్ట్రైకింగ్ ఇవ్వచ్చు కదా పోవెల్ ఎందుకు అలా చేశాడు అని అనుకున్నారు. కానీ, పోవెల్ కూడా అదే చెప్పాడంట. లాస్ట్ ఓవర్ కి ముందు వార్నర్ దగ్గరకు వెళ్లి పోవెల్.. ‘సింగిల్ తీసి ఇస్తాను సెంచరీ పూర్తి చేసుకో అని చెప్పాను. అందుకు వార్నర్ రిటర్న్ లో నాకే క్లాస్ పీకాడు. చూడు క్రికెట్ అలా కాదు ఆడేది. నువ్వు ఎంత బాగా ఆడగలవో ఆడు అంటూ నాకే అవకాశం ఇచ్చాడు’ అంటూ రోవ్మన్ పోవెల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. వార్నర్ ఫ్యాన్స్ అందరూ ఆ మాట విన్నాక అట్లుంటది మా వార్నర్ భాయ్ తో అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ స్పోర్ట్స్ మన్ స్పిరిట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
David Warner told Rovman Powell to go all guns blazing when he was stranded at 92*.
📸: Disney+Hotstar pic.twitter.com/P8jJUGCeux
— CricTracker (@Cricketracker) May 5, 2022
Thank You @davidwarner31 @SunRisers @DelhiCapitals for having some fun with us (your fans in today’s IPL Match Vs SRH) ..!👌👌👍
We enjoyed your batting and also Pushpa Style while your fieliding. Thank You. #IPL2022 #IPL #SRHvsDC pic.twitter.com/YNUy9VITdX— ONKAR GANORE (@onkarganore) May 5, 2022