ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించి.. అరంగేట్రం సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. గతంలో ఇలాంటి రికార్డును సాధించిన రాజస్థాన్ రాయల్స్‌పైనే ఈ విషయం సాధించడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసి చరిత్ర సృష్టించాడు. పైగా ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి డెలవరీతో అదరగొట్టాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బాల్ గంటకు 157.0 కిలో మీటర్ల రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ బౌలర్ జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉంది.
ఉమ్రాన్ మాలిక్ గంటకు 157 కిలో మీటర్ల వేగంతో బంతి వేస్తే.. క్రికెట్ అభిమానులతో పాటు.. నిపుణులు సైతం ఔరా అన్నారు. ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశమే లేదనుకున్నారు. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివరీ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఫెర్గూసన్ గంటకు 153 కిలో మీటర్ల వేగంతో బంతి వేశాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్ రికార్డు కొంతకాలం పాటు అలా నిలిచిపోతుందని అంతా భావించారు. కానీ.. ఐపీఎల్ ఫైనల్‌లోనే ఈ రికార్డును ఫెర్గూసన్ బ్రేక్ చేశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి జోస్ బట్లర్ స్ట్రైక్‌లో ఉండగా.. గంటకు 157.3 కిలో మీటర్ల వేగంతో బాల్ వేసి అదరగొట్టాడు. ఈ సీజన్‌కే కాక.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన బంతి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్థిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్థిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఫాస్టెస్ట్ డెలివరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: వీడియో: వికెట్ తీసి అంపైర్‌తో సెలబ్రేట్ చేసుకున్న హార్థిక్ పాండ్యా
Lockie Ferguson just bowled the fastest ball of the IPL 2022 season.
📸: Disney+Hotstar pic.twitter.com/aCg0aqwYip
— CricTracker (@Cricketracker) May 29, 2022
Lockie Ferguson ⚡⚡#IPL2022 #IPLFinal #GTvRR pic.twitter.com/DUUHqpPhMA
— RVCJ Media (@RVCJ_FB) May 29, 2022
— Sayyad Nag Pasha (@PashaNag) May 30, 2022