ఐపీఎల్ 2022 సీజన్‌లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో ఓ సెంచరీ నమోదు చేసిన రాహుల్.. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్లో కూడా సెంచరీతో కదం తొక్కాడు. కాగా కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో చేసిన రెండో సెంచరీలు కూడా ముంబైపేనే చేయడం విశేషం. ఏప్రిల్ 16న ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శతకం బాదిన రాహుల్.. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ శతక్కొట్టాడు. తద్వారా అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే టీమ్‌పై ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇలాంటి రికార్డును ఇంతవరకు మరే క్రికెటర్ ఐపీఎల్‌లో సాధించలేదు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ 4 సెంచరీలు చేస్తే.. అందులో 3 ముంబైపేనే కొట్టాడు. ఇప్పటి వరకు ముంబైతో 16 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 867 పరుగులు చేశాడు.
అలాగే మరో అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ(6) రికార్డును రాహుల్ సమం చేశాడు. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు, ఐపీఎల్ 4 సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. ఐదు సెంచరీలతో కోహ్లి తొలి స్థానంలో ఉండగా, రాహుల్ 4 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. జవాబుగా ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 132 పరుగులు చేసి ఓటమి పాలైంది. మరి కేఎల్ రాహుల్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముంబై జట్టులో విబేధాలు! 2 గ్రూప్ లుగా విడిపోయారు: క్రిస్ లిన్!
CENTURY for @klrahul11 👏👏
His second in #TATAIPL 2022 pic.twitter.com/GPTGfKHKYl
— IndianPremierLeague (@IPL) April 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.