ఐపీఎల్ 2022 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అన్ని జట్లు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకుని తమ ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించాయి. ఇప్పటికే పెద్ద తలా అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా ఆడేస్తున్నాడు. హెలీకాప్టర్ షాట్స్ తో గ్రౌండ్ లో హీట్ పెంచుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. ఆ టీమ్ కెప్టెన్ కేన్ మామ క్యాంపులో అడుగుపెట్టాడు. ఆ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఎస్‌ఆర్‌హెచ్ తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి: IPL 2022 నిబంధనల్లో కొత్త మార్పులు!
గత సీజన్ లో జాబితాలో చిట్ట చివరి జట్టుగా సరిపెట్టుకున్న.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. సన్ రైజర్స్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లపై మొదట ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ తర్వాత వాళ్ల పేర్లే క్రికెట్ ప్రపంచంలో రీసౌండ్ వచ్చాయి. కావ్య పాప ప్లాన్ ఏంటో ఆ తర్వాత అందరికీ అర్థమైంది. ఇప్పుడు కేన్ మామ ఎంట్రీతో హైదరాబాద్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లైంది. ఆ విషయాన్ని ట్వీట్ చేస్తూ ‘సడెన్ గా సమ్మర్ కూల్ గా అనిపిస్తుంది అంటే.. ఎవరో వస్తున్నారని అర్థం. కేన్ మామకు స్వాగతం’ అంటూ ఎస్‌ఆర్‌హెచ్ ట్వీట్ చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ జట్టు మార్చి 29న తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఏప్రిల్ 4న పుణే సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 9 చెన్నైసూపర్ కింగ్స్, 11 గుజరాత్ టైటాన్స్, 15 కోల్‌కతా నైట్ రైడర్స్, ఏప్రిల్ 17 పంజాబ్ కింగ్స్, 23 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏప్రిల్ 27 గుజరాత్ టైటాన్స్, మే 1న చెన్నైసూపర్ కింగ్స్, 5న ఢిల్లీ, 8 బెంగళూరుతో, మే 14న కోల్‌కతా, 17 ముంబై ఇండియన్స్, మే 22న లీగ్ దశలో చివరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. మొత్తం లీగ్ స్టేజ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్ 2022 సీజన్లో హైదరాబాద్ జట్టు కప్పు కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sudden ga summer cool ga anipistundi ante #SRH camp lo evaro adugupedutunnaru 🤪
Welcome, Kane Mama 🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/biplUU6fZm
— SunRisers Hyderabad (@SunRisers) March 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.