ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ బౌలర్‌గా పేరొందిన శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగాది ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్. తన బౌలింగ్ యాక్షన్‌తో స్పెషల్ గుర్తింపు పొందిన మలింగా తన కచ్చితమైన డెడ్లీ యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మలింగా వీడ్కోలు పలికి కోచింగ్‌లో కెరీర్ ఆరంభించాడు. కాగా.. మలింగా లాంటి యాక్షన్, యార్కర్లతో మరో శ్రీలంకన్ క్రికెటర్ మతీష పతిరాణా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఐపీఎల్ 2022లో తన తొలి మ్యాచ్ ఆడాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగాడు. పైగా ఐపీఎల్‌లో తన వేసిన తొలి బంతికే వికెట్ తీసి తన ఎంట్రీని ఘనంగా చాటాడు.
మలింగా వారసుడిగా పేరుతెచ్చుకున్న పతిరాణా.. తొలి బంతికే వికెట్ తీసి మలింగా పేరును నిలబెట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నా.. వేలంలో ఇతన్ని ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. గాయం కారణంగా CSK ఆటగాడు ఆడమ్ మిల్నే టోర్నీకి దూరమవ్వడంతో అతని స్థానంలో చెన్నై మతీషను తీసుకుంది. దీంతో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మతీషకు బరిలోకి దిగే అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసేందుకు వచ్చిన మతీష.. తొలి బంతిని శుభమన్ గిల్‌కు సంధించాడు. మతీష స్పీడ్‌ను జడ్జ్ చేయడంలో విఫలం అయిన గిల్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ తీసుకుని ఔరా అనిపించాడు జూనియర్ మలింగా.
ఈ మ్యాచ్‌లో 3.1 ఓవర్ వేసిన మతీష 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఫేలవ బ్యాటింగ్‌తో 133 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా CSK బౌలర్లు చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో జూనియర్ మలింగా మతీష పతిరాణా బౌలింగ్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rajat Patidar: RCB బ్యాటర్ భారీ సిక్స్.. తలకు తగిలి బోరుమన్న ముసలాయన.. వీడియో వైరల్!
L. B. W! ☝️
A first-ball wicket on the IPL debut for Matheesha Pathirana! 👍 👍#GT lose Shubman Gill in the chase.
Follow the match ▶️ https://t.co/wRjV4rFs6i #TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/TLSn6kob65
— IndianPremierLeague (@IPL) May 15, 2022
Dream Debut! 😍 #MatheeshaPathirana Congrats! 🔥 #IPL2022 #CSKvsGT https://t.co/rsJ7tEbOrj
— Pray For Sri Lanka! 🇱🇰 (@aaaaaloke) May 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.