ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ సహనం కోల్పోయాడు. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఫించ్ ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫించ్ జోరుకు ప్రసిద్ధ్ కృష్ణ బ్రేక్ వేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్.. అతనిపై నోరు పారేసుకున్నాడు. క్రీజును వీడుతూ.. ప్రసిద్ధ్‌ను తన మాటలతో కవ్వించాడు. దీనికి కృష్ణ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు.
వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలియదు కానీ ప్రసిద్ధ్ హావభావాలను చూస్తే మూసుకోని పోమ్మనట్లు ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 9వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఫించ్.. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్ చివరి బంతిని వైడ్ బౌన్సర్‌గా ప్రసిద్ధ్ వేయగా.. ఫించ్ అప్పర్ కట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బ్యాక్ వర్డ్ పాయింట్ వైపు గాల్లోకి లేచి కరుణ్ నాయర్ చేతికి చిక్కింది. అవుట్ అయిన ఫ్రస్టేషన్‌లో ఫించ్ యువ పేసర్‌పై నోరు పారేసుకున్నాడు. దానికి ప్రసిద్ధ్ కూడా ఎంత తక్కువ తినలేదనంటూ.. సమాధానం ఇచ్చాడు.కాగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 7 పరుగులతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. మరి ఫించ్, ప్రసిద్ధ్ కృష్ట మధ్య జరిగిన గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: వెంకటేశ్ అయ్యర్‌పై తిట్లతో విరుచుకుపడ్డ శ్రేయస్ అయ్యర్
#AaronFinch and #PrasidhKrishna had a bit of a heated exchange pic.twitter.com/dWJmSSrswa
— Raj (@Raj93465898) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.