వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ తన బౌలింగ్‌లోనే ఒక స్టన్నింగ్స్ పట్టి ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ వేసిన తొలి బంతికే పృథ్వీషా గోల్డెన్ డక్ అయ్యాడు. లెగ్ స్టంప్స్ మీదికి దూసుకొచ్చిన ఆ హాఫ్-వ్యాలీ బంతిని ఆన్‌సైడ్ ఫ్లిక్ చేయబోయాడు పృథ్వీ షా. కాస్త ఎర్లీగా బ్యాట్ పేస్‌ను మూసేయడంతో. టైమింగ్ మిస్ అయి బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ బంతిని గాల్లోకి అమాంతం డైవ్ చేస్తూ.. ఉమేష్ యాదవ్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను పృథ్వీ షా నమ్మలేకపోయాడు. కొన్ని సెకెన్ల పాటు క్రీజ్‌లోనే ఉండిపోయాడు. చేసేదేం లేక నిరాశగా వెనుదిరిగాడు.
ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ఫామ్ బ్యాటర్ పృథ్వీ షా అవుట్ అవ్వడంతో కేకేఆర్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అద్భుతమైన బౌలింగ్‌తో పాటు అంతకంటే అద్భుతమైన క్యాచ్ పట్టిన ఉమేష్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ ఉమేష్ యాదవ్ అందించిన ఈ సూపర్ స్టార్ట్‌ను కేకేఆర్ కొనసాగించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. ఉమేష్ యాదవ్ దెబ్బకు కాస్త తడబడ్డ ఢిల్లీ కోలుకుని మ్యాచ్‌ను గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ రాణా (34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించారు. కుల్దీప్ యాదవ్(4/14), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) కేకేఆర్ పతనాన్ని శాసించగా.. చేతన్ సకారియా, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ వార్నర్(26 బంతుల్లో 8 ఫోర్లతో 42), రోవ్‌మెన్ పొవెల్(33 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. హృతీష్ రాణా, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఉమేష్ యాదవ్ సూపర్ డైవ్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Warner: అరుదైన ఘనత సాధించిన వార్నర్! IPLలోనే తొలి ప్లేయర్
— Maqbool (@im_maqbool) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.