ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం సాధించింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. సీజన్‌లో కొత్త టీమ్ గుజరాత్‌కు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. కాగా.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్ ఏకంగా 22 ఎక్స్‌ట్రా రన్స్ సమర్పించుకుంది. ఇందులో 20 వైడ్ బాల్స్ ఉన్నాయి. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వైడ్స్ వేసిన రెండో టీమ్‌గా సన్‌రైజర్స్ ఒక చెత్త రికార్డును నమోదు చేసింది.
భువనేశ్వర్ కుమార్ ఒక్కడే 12 వైడ్స్ వేయగా.. ఉమ్రాన్ మాలిక్ 5, మార్కో జాన్సెన్ 2, నటరాజన్ ఓ వైడ్ వేసాడు. ఇంతకు ముందు ఆర్సీబీ 21 వైడ్స్ వేసింది. ఈ సీజన్‌లోనే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ 21 వైడ్స్ వేసింది. ఇందులో మహమ్మద్ సిరాజ్ ఒక్కడే 14 వైడ్స్ వేశాడు. తాజా మ్యాచ్‌తో భువీ.. సిరాజ్ తర్వాత అత్యధిక వైడ్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ వేసిన 28 ఎక్స్‌ట్రాలే ఇప్పటి వరకు అత్యధికంగా ఉన్నాయి. 2008లో డెక్కన్ చార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఈ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఆ తర్వాత 27 ఎక్స్‌ట్రాలతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్(26), చెన్నై సూపర్ కింగ్స్(26) ఉన్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సీనియర్ అని చూడకుండా నోరుపారేసుకున్న పాండ్యా! వీడియో వైరల్
The #Risers go back-to-back! 🧡
Here’s a recap of another impressive win, last night. 💪 #SRHvGT #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/GpFIBp6QzV
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.