టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి నోరు పారేసుకున్నారు. క్రికెట్ కామెంట్రీ చెప్తు అనవసరమైన విషయాలను మధ్యలోకి తెచ్చి విమర్శల పాలవుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న లిటిల్ మాస్టర్ వెగటు పుట్టించే తన మాటలతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ బ్యాటింగ్‌ను ఉద్దేశిస్తూ.. సరదాగా అతను చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
హెట్‌మైర్ సతీమణి ప్రెగ్నన్సీ విషయాన్ని ప్రస్తావిస్తూ గవాస్కర్ హద్దులు ధాటి మాట్లాడారు. దాంతో నెటిజన్లు గవాస్కర్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తన్ని తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదిగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. షిమ్రాన్ హెట్‌మైర్ ఇటీవలే పెటర్నీటీ లీవ్ మీద స్వదేశం వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తన భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండాలని భావించిన హెట్‌మైర్.. ఈ బ్రేక్ తీసుకున్నాడు. అతని సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ జట్టుతో చేరాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.ఈ మ్యాచ్‌లో చెన్నై విధించిన 151 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. హెట్‌మైర్ క్రీజులోకి వచ్చేసరికి రాజస్థాన్ విజయ సమీకరణం 52 బంతుల్లో 75 పరుగులుగా ఉంది. ఆ టైమ్‌లో కామెంటేటర్‌గా ఉన్న గవాస్కర్ …’ఇటీవలే హెట్‌మైర్ సతీమణి డెలీవరీ అయింది.. మరీ ఈ మ్యాచ్‌లో అతను రాజస్థాన్‌కు డెలివరీ చేస్తాడా?’ అంటూ అనాలోచిత వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు.. టీవీ ప్రేక్షకులతో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. హెట్‌మైర్ సతీమణి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. దిగ్గజ క్రికెటర్‌గా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడేందకు కొంచమైన సిగ్గుండాలని తీవ్రంగా దూషిస్తున్నారు.
సునీల్ గవాస్కర్ బ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవ్వడం గవాస్కర్ ఇదే తొలిసారి కాదు. గతంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఉద్దేశిస్తూ అనుష్క శర్మ ప్రస్తావన తీసుకొచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అనుష్క శర్మ చేతిలో చివాట్లు కూడా తిన్నాడు. విరాట్ బ్యాటింగ్ వైఫల్యాన్ని వివరిస్తూ.. లాక్‌డౌన్‌లో సరైన సదుపాయాలు లేక కోహ్లీ అనుష్క బంతులతో ప్రాక్టీస్ చేశాడని వ్యాఖ్యానించాడు. ఇది డబుల్ మీనింగ్‌కు దారితీయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాను తప్పుడు అర్థంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, విరాట్,అనుష్క లాక్‌డౌన్‌లో సరదాగా క్రికెట్ ఆడిన వీడియోనుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకున్నాడు.
ఇదీ చదవండి: Ravichandran Ashwin: రెండో ఐపీఎల్ ట్రోఫీపై గురిపెట్టిన రాజస్థాన్! అశ్విన్ కల నెరవేరేనా?
#SunilGavaskar gets tangled in controversy | @ITGDSportshttps://t.co/e8KEqPBpr6
— IndiaToday (@IndiaToday) May 20, 2022