ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. నితీష్ రాణా(54), ఆండ్రూ రస్సెల్(49 నాటౌట్) పరుగులతో రాణించారు.
లక్ష్యఛేదనకు దిగిన SRHకు ఆదిలోనే ప్యాట్ కమిన్స్ దెబ్బతిశాడు. 3 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ వర్మను బౌల్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి మంచి టచ్‌లో కనిపించిన కేన్ విలియమ్సన్‌ను.. రస్సెల్ బౌల్డ్ చేయడంతో SRH 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి రాహుల్ త్రిపాఠి(71), మార్కరమ్(68) సన్‌రైజర్స్‌ను అద్భుతంగా విజయం వైపు నడిపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో సన్‌రైజర్స్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుట్ అవ్వడంతో.. తన సహజ శైలికి భిన్నంగా రియాక్ట్ అయ్యాడు. కోపంతో బ్యాట్‌ను స్టంప్స్‌పై నుంచి వేగంగా తిప్పాడు. కేన్ గతంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. చివరికి మ్యాచ్ గెలవడంతో.. సోషల్ మీడియాలో కేన్ కోపంతో బ్యాట్ తిప్పిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘కేన్ మామ మ్యాచ్ గెలిచాం కూల్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ చాలా ఆనందంగా కనిపించారు. తొలి రెండు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చిన కావ్య.. తన టీమ్ ఓడిపోవడంతో చాలా నిరాశ చెందారు. ఇప్పుడు మాత్రం ఆనందంతో గంతులేశారు. మరి సన్‌రైజర్స్ మూడో విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములకి కారణం?
THE VERDICT IS OUT. 🔥💪🏾#SRHvKKR #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/tyEBJXjZij
— SunRisers Hyderabad (@SunRisers) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.