SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Sanju Samson Reveals The Reason Behind Their Defeat Against Gujarat Titans In Qualifier 1

IPL 2022: ఫైనల్‌ చేరిన గుజరాత్‌ టైటాన్స్‌! రాజస్థాన్‌ కొంపముంచిన ప్రసిద్ధ్‌ కృష్ణ

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 25 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: ఫైనల్‌ చేరిన గుజరాత్‌ టైటాన్స్‌! రాజస్థాన్‌ కొంపముంచిన ప్రసిద్ధ్‌ కృష్ణ

ఐపీఎల్‌ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ జరిగింది. రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్‌ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్‌2లో పోటీ పడనుంది. ఈ ఓటమిపై రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ స్పందిస్తూ.. కొన్ని ఎక్స్‌ట్రా పరుగులు.. ఒకరిద్దరి చెత్త ఓవర్లు గుజరాత్ టైటాన్స్‌‌ చేతిలో తమ ఓటమికి కారణమయ్యాయని అన్నాడు. తమకు లక్ కలిసి రాలేదని, టాస్ ఓడటం శాపంగా మారిందని, చేజింగ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించిందని తెలిపాడు.

తమ బ్యాటింగ్ సమయంలో బంతి ఆగి రావడంతో పాటు అనూహ్య బౌన్స్, స్వింగ్ అయ్యిందని చెప్పిన సంజూ… దాంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందన్నాడు. కానీ చేజింగ్‌లో మాత్రం పరిస్థితులు బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మారాయని చెప్పుకొచ్చాడు. ‘స్వింగ్, అనూహ్య బౌన్స్‌తో బ్యాటింగ్ కష్టంగా మారిన పరిస్థితుల్లో మేం పోరాడే లక్ష్యాన్నే ప్రత్యర్థి ముందు ఉంచాం. కానీ గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా వికెట్ బ్యాటింగ్‌కు కష్టంగా కనిపించింది. కానీ అదృష్టవశాత్తు నేను పవర్ ప్లేలో పరుగులు రాబట్టగలిగాను. ఈ పరిస్థితుల్లో మేం నిర్థేశించిన లక్ష్యం కాపాడుకోదగినదే. పైగా మాకు అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్‌ ఉంది. మా ప్రధాన ఐదుగురు బౌలర్లు టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించారు. వారికి రియాన్ పరాగ్ సైతం సహకారం అందించాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఆ జోరు చూపట్టలేకపోయారు. పైగా వికెట్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో చాలా మారింది. బ్యాట్‌పైకి బంతి సులువుగా వచ్చిందని అన్నాడు. క్వాలిఫైయర్‌ 2లో బలంగా కమ్ బ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఈ టీ20 ఫార్మాట్‌లో టాస్ గెలవడం చాలా ముఖ్యం. అప్పుడు అన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. తదుపరి మ్యాచ్‌లో మాకు అనుకూల ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా’అని సంజూ చెప్పుకొచ్చాడు.Chahalకాగా.. ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో గుజరాత్ విజయానికి 34 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన చాహల్ నాలుగు బంతులు సరిగ్గా వేసి ఐదో బంతికి సిక్స్ ఇచ్చి మొత్తం 11 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్‌కాయ్ వేసిన 19వ ఓవర్‌లో బౌండరీ బాది క్విక్ సింగిల్‌తో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే రావడంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్‌లో మిల్లర్ వరుసగా మూడు సిక్స్‌లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో చివరి ఓవర్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణ 16 పరుగులు డిఫెండ్‌ చేయలేకపోయాడని రాజస్థాన్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. రాజస్థాన్‌ ఓటమికి ప్రసిద్ధ్‌ కృష్ణనే కారణం అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్‌(56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 89 పరుగులు)కు తోడుగా సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), దేవదత్ పడిక్కల్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మిల్లర్‌కు తోడుగా హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్), శుభ్‌మన్ గిల్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35), మాథ్యూ వేడ్(30 బంతుల్లో 6 ఫోర్లతో 35) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఒబేడ్ మెక్‌కాయ్ తలో వికెట్ తీసారు.

ఇదీ చదవండి: Ravichandran Ashwin: తనని తాను ఎంఎస్‌ ధోని అనుకున్న అశ్విన్‌! పాపం పరాగ్‌..

BRB, stronger. 👊 pic.twitter.com/Ji27W8ksWP

— Rajasthan Royals (@rajasthanroyals) May 24, 2022

Tags :

  • ipl 2022
  • RR vs GT
  • Sanju Samson
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

Asia Cup 2023: ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

  • Thilak Varma: సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

    Thilak Varma: సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

  • Indian Cricket: హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! సంజూకు చాన్స్‌

    Indian Cricket: హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! సంజూకు చాన్స్‌

  • India vs West Indies: రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

    India vs West Indies: రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

  • Sanju Samson: సంజు శాంసన్ ని గుర్తు చేసిన సూర్యకుమార్ యాదవ్! గ్రౌండ్ లో ఏం చేసాడంటే?

    Sanju Samson: సంజు శాంసన్ ని గుర్తు చేసిన సూర్యకుమార్ యాదవ్! గ్రౌండ్ లో ఏం చేసాడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam