ఐపీఎల్ 2022లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.24 లక్షల జరిమానా విధించారు. జట్టులోని మిగతా సభ్యులకు రూ.6 లక్షలు జరిమానా పడింది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మకు ఇది రెండో జరిమానా.. ఇంతకు ముందు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల ఫైన్ రోహిత్ నెత్తిన పడింది. మరో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు అయితే.. రోహిత్ శర్మపై ఒక మ్యాచ్ నిషేధం వేటు పడనుంది.
కేవలం ఐదు మ్యాచ్‌లలోనే రెండు మ్యాచ్‌లలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ముంబై ఇండియన్స్.. మరో సారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోహిత్ ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు. కాగా ముంబైలో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా లేకపోవడంతో.. ఐదో బౌలర్‌ను ప్రయోగించే సమయంలో కెప్టెన్ ఎక్కువ సమయంలో తీసుకుంటుండడంతోనే స్లో ఓవర్ రేట్ నమోదు అవుతుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ముంబై ఇండియన్స్ మరోసారి ఈ తప్పిదం చేయకుండా జాగ్రత్త పడుతుందో.. లేక రోహిత్‌ను ఒక మ్యాచ్‌లో బెంచ్‌పై కూర్చోబెట్టుకుంటుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్‌కు పాదాభివందనం చేసిన జాంటీ రోడ్స్!
#MumbaiIndians (@mipaltan) captain #RohitSharma (@ImRo45) was fined Rs 24 lakh for maintaining a slow over rate during their Indian Premier League (#IPL) 2022 match against #PunjabKings (@PunjabKingsIPL).
Photo : @IPL pic.twitter.com/v66zoiIQWm
— IANS (@ians_india) April 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.