ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఫ్రాంచైజ్ తరపున 200 సిక్సులు కొట్టి.. ముంబై ఇండియన్స్‌లో కీరన్ పొలార్డ్ తర్వాత 200 సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మంచి టచ్‌లో కనిపించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 43 పరుగులు చేశాడు. షమీ బౌలింగ్లోనూ ల్యాప్ షాట్‌ను ఆడి సిక్సర్ బాదాడు. ఈ సిక్స్‌తో రోహిత్ ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ కోసం అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో చేరాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 263సిక్సర్లతో అత్యధికంగా ఓ ఫ్రాంఛైజీ తరఫున సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
పొలార్డ్(257) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ (240 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (228 సిక్సర్లు) ఈ జాబితాలో మూడు, నాలుగో స్థానంలో ఉన్నారు. గేల్, కోహ్లీ, డివిలియర్స్ ముగ్గురు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫునే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. 5వ స్థానంలో రోహిత్ శర్మ (200సిక్సర్లు) ఉన్నాడు. రోహిత్ ఇంకో 41 సిక్సులు కొడతే డివిలియర్స్‌ను దాటేస్తాడు. అది ఈ సీజన్‌లో సాధ్యం కాకపోయినా.. వచ్చే ఏడాది జరగొచ్చు. ఇప్పటికైతే రోహిత్ 200 సిక్సులతో నాటౌట్‌గా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు సురేశ్ రైనా (220 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (218 సిక్సర్లు) కూడా ఐపీఎల్‌లోని 200 సిక్సర్లు బాదిన లిస్టులో ఉన్నారు.. కానీ వారు చెన్నైతో పాటు వేరే జట్టుతో కలిపి ఈ సిక్సర్లు సాధించారు. మరి రోహిత్‌శర్మ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Daniel Sams: ఇన్ని రోజులు ముంబైకి భారంగా మారిన సామ్స్.. భారీ విజయాన్ని అందించాడు
.@RanveerOfficial loved that Rohit Sharma six🤩
📸: Disney+Hotstar#GTvsMI #IPL2022 pic.twitter.com/lfV5t8heE1
— CricTracker (@Cricketracker) May 6, 2022
𝙲𝙰𝙿𝚃𝙰𝙸𝙽 𝙷𝙸𝚃𝙼𝙰𝙽 🤝 2️⃣0️⃣0️⃣ – A धमाकेदार connection! 😎@ImRo45 has now hit 200 sixes for #MumbaiIndians 💙#OneFamily #DilKholKe #GTvMI pic.twitter.com/kPYhYRWM4H
— Mumbai Indians (@mipaltan) May 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.