ఐపీఎల్ 2022లో ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అనే నినాదాన్ని నిజం చేసేందుకు ఆర్సీబీ రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించిన డుప్లెసిస్ సేన.. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌తో పోరుకు సిద్దమైంది. ఎలిమినేటర్ విజయంతో ఫుల్ జోష్ ఉన్న ఆర్సీబీ.. కోల్‌కత్తా నుంచి అహ్మాదాబాద్‌కు పయనమైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలోనే ఆర్సీబీ.. రాజస్థాన్‌తో క్వాలిఫైయర్ 2 ఆడనుంది. కాగా.. ఈ ప్రయాణంలో ఆర్సీబీ ఆటగాళ్లు ఫుల్‌జోస్‌లో కనిపించారు.
విమానంలో అయితే స్టార్ బౌలర్ సిరాజ్ ఆటగాళ్లందర్ని ఇంటర్వ్యూ చేసే స్పెషల్ ప్రొగ్రామ్ పెట్టుకున్నాడు. ముందుగా షాబాజ్ అహ్మాద్‌తో మాట్లాడిన సిరాజ్.. తర్వాత హసరంగాపై పడ్డాడు. ముందుగా సిరాజ్, షాబాజ్ మాట్లాడుకుంటుండగా.. హసరంగా ఏంట్రా బాబు ఇది అన్నట్లు ఫేస్ పెట్టాడు. ఈ వీడియోలో హసరంగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు వైరల్‌గా మారాయి. సిరాజ్ ఓవరాక్షన్ చేస్తుంటే.. హసరంగా గాలి తీసేశాడని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక హసరంగా తర్వాత సిరాజ్ మరికొంత మందితో మాట్లాడించాడు. చాలా సరదాగా వారి మధ్య సంభాషణలు సాగాయి. ఇక శుక్రవారం రాజస్థాన్‌తో జరగబోయే క్వాలిఫైయర్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఆర్సీబీకి సంపూర్ణ ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.అలాగే తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో రాజస్థాన్ రాయల్స్ కొంత నిరాశలో ఉంది. పైగా వారిపై ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. క్వాలిఫైయర్ ఓటమితో ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్‌తో ఆర్సీబీ ఏ విధంగా ఆడునుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీనే హాట్ పేవరేట్‌గా బరిలోకి దిగనుంది. 2016 ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ ఆడింది. ఆ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. మరి ఈ సారీ ఫైనల్ చేరి అలాంటి పొరపాటు చేయకుండా కప్పు కొట్టాలని ఆర్సీబీ ప్లేయర్లు అంతా దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి సిరాజ్ ఇంటర్వ్యూ, హసరంగా రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jos Buttler: బట్లర్‌ను నా రెండో భర్తగా దత్తత తీసుకున్న! స్టార్ క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్