ఐపీఎల్ 2022లో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. 13 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్‌లో మూడో గెలుపును నమోదు చేసింది. ధోనీ సారథ్య బాధ్యతలను స్వీకరించిన తొలి మ్యాచ్‌లోనే విక్టరీని అందుకుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇదే సన్‌రైజర్స్ చేతిలో ఓడింది చెన్నై. దానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది. ఈ గెలుపుతో చెన్నై ఖాతాలో ఆరు పాయింట్లు వచ్చాయి. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మాజీ కేప్టెన్ రవీంద్ర జడేజా వైఫల్యానికి గల కారణాలను పరోక్షంగా వెల్లడించాడు.
గత సీజన్‌లో జట్టు అద్భుతంగా రాణించిందని, దాన్ని గుర్తుంచుకుని కెప్టెన్‌గా రవీంద్ర జడేజా తన బాధ్యతలను నిర్వర్తిస్తాడని భావించానని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో జడేజా పనితీరును గమనించానని, టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ రాటుదేలుతాడని అనుకున్నానని చెప్పాడు. కెప్టెన్‌గా జడేజా సొంత నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని, ప్రతిదీ చెప్పలేమని అన్నాడు. ఒక్కసారి కెప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించిన తరువాత.. ఎన్నో అంచనాలు ఏర్పడటం సహజమని వ్యాఖ్యానించాడు. దాని ప్రభావం ప్లేయర్‌గా అతని వ్యక్తిగత ప్రదర్శనను దెబ్బ తీయొచ్చని చెప్పాడు.జడేజా విషయంలో అదే జరిగిందని అన్నాడు. కెప్టెన్సీ భారం జడేజా వ్యక్తిగత ప్రదర్శనను దెబ్బ తీసిందని అన్నాడు. దీంతో కెప్టెన్‌గా జడేజా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినట్లు ధోని వ్యాఖ్యలతో అర్థం అవుతోంది. అందుకే కెప్టెన్సీని ధోనికి హ్యాండ్ ఓవర్ చేసినట్లు సమాచారం. జడేజా కెరీర్ గురించి ఆలోచించి ధోని కూడా మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. మరి జడేజా కెప్టెన్సీ విషయంలో ధోని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: బెన్ స్టోక్స్ గురించి ఐదేళ్ల క్రితం ధోని చెప్పిందే జరిగింది!
MS Dhoni talked about handing over CSK’s captaincy to Ravindra Jadeja earlier in this season.#MSDhoni #RavindraJadeja #CSK #IPL2022 #Cricket #CricTracker pic.twitter.com/ZvVPIbPYlO
— CricTracker (@Cricketracker) May 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.