ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు మెల్లమెల్లగా చిగురిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై తప్పించి అన్ని జట్ల మధ్య ప్లేఆఫ్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో చెన్నైకి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కోసం చాలా సమీకరణాలు జరగాల్సింది. కాగా.. ఆదివారం ఢిల్లీ క్యాపిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 91 పరుగులతో తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో CSK కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. చివర్లో బ్యాటింగ్ వచ్చిన మహీ 8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు స్కోర్‌ను 200 దాటించాడు. ఇందులో ఓ సిక్స్ అభిమానుల మనసులను గెలుచుకుంది.
ఇక ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో మహీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ధోని ఒక్కడికే ఈ ఘనత సాధ్యమైంది. ఇక టీ20ల్లో కెప్టెన్‌గా 6వేల పరుగుల మైలురాయిని కూడా ధోనీ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఘనతకు 6 పరుగుల దూరంలో నిలిచిన మహీ.. 185 ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌గా 5994 పరుగులు చేశాడు. 6 వేల పరుగుల మైలురాయిని కూడా ధోని సిక్స్‌తోనే అందుకోవడం విశేషం. ధోనీ కన్నా ముందు విరాట్ కోహ్లీ ఒక్కడే కెప్టెన్‌గా ఈ ఘనతను అందుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌కు ముందు నుంచి ధోనినే కెప్టెన్‌గా ఉంటే.. CSK వేరే లెవెల్లో ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ధోని రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. ఇలా జరిగేతే చెన్నై ప్లే ఆఫ్స్ కి చేరడం పక్కా!
Thala takkar doiii…!! 🥳💥#WhistlePodu #Yellove #CSKvDC 💛🦁 pic.twitter.com/P01OC6wd6P
— Chennai Super Kings (@ChennaiIPL) May 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.