ఐపీఎల్ 2022లో గురువారం టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓడితే ఆర్సీబీ ప్రశాంతంగా ప్లేఆఫ్‌కు చేరనుంది. కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మ్యాథ్యూ వేడ్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. టోర్నీ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ తరపున శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేవాడు. కానీ.. స్థాయి తగ్గట్లు రాణించలేకపోవడంతో అతని స్థానంలో వృద్ధిమాన్ సాహా జట్టులోకి వచ్చాడు. సాహా అంచనాలు మించి రాణిస్తుండడంతో అతని స్థానం జట్టులో స్థిరమైంది. ఇక వేడ్ బెంచ్‌కే పరిమితం అవుతాడని అనుకుంటున్న సమయంలో గుజరాత్ టీమ్ అతని సాహా జట్టులో ఉండగానే మరో అవకాశం ఇచ్చింది.
గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వేడ్ సూపర్ టచ్‌లో కనిపించాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 16 పరుగులు చేసి మంచి జోష్‌లో కనిపించాడు. ధాటిగా ఆడే క్రమంలో పవర్‌ప్లేలో మ్యాక్స్‌వెల్ వేసిన చివరి ఓవర్ 2వ బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని మిస్ అయ్యాడు. దీంతో బంతి ప్యాడ్లకు తాకింది. పీల్డింగ్ టీమ్ అప్పీల్‌తో అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ.. వేడ్ చాలా కన్ఫిడెంట్‌గా డీఆర్‌ఎస్ కోరుకున్నాడు. థర్డ్ అంపైర్ కూడా అవుట్ అని ప్రకటించడంతో వేడ్ సహనం కోల్పోయాడు. తన బ్యాట్‌కు బంతి తాకిందని గ్రౌండ్‌లోనే అసహనం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్ల వచ్చి సముదాయించడంతో పెవిలియన్‌కు వెళ్లాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తూనే హెల్మెట్‌ను నేలకేసి కొట్టి బీభత్సం చేశాడు. తర్వాత తన బ్యాట్‌ను విరగొట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న స్టాఫ్ ఇది చూసి షాక్ తిన్నారు. అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడంటూ వేడ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వేడ్ కోపంతో బ్యాట్ విరగ్గొట్టిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. చాలా రోజుల తర్వాత జట్టులో స్థానం దక్కడం.. మంచి స్టార్ట్ దొరకడంతో పెద్ద ఇన్నింగ్స్ ఆడుదాం అనుకున్న వేడ్ ఇలా దురదృష్టవశాత్తు అవుట్ అవడంతో సహనం కోల్పోయాడు. నిజానికి అంపైర్ నిర్ణయం తప్పు అని సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటికే తప్పుడు నిర్ణయాలతో అంపైర్లు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Mystery Girls IPL 2022: ఆహా ఏమి అందం.. IPL 2022లో తళుక్కుమంటున్న మిస్టరీ గర్ల్స్!
When you return home from office on Monday #wade #mathewwade #GTvsRCB pic.twitter.com/7QOtT6mfn7
— hitanshu_bhatt21 (@BHATTer_PUNner) May 19, 2022