ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. టోర్నీ ఆరంభం తొలి రెండు మ్యాచ్‌లు ఓడినా.. తర్వాత కొలుకుని వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి అదరహో అనిపించింది. కానీ.. మళ్లీ హ్యాట్రిక్ ఓటములతో డీలా పడింది. పైగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా విఫలం అవుతుండడంతో SRH మరింత ఆందోళన పెరిగింది. అన్ని ఫార్మాట్లలో స్థిరమైన రన్ స్కోరర్‌గా విలియమ్సన్కు పేరుంది. కానీ ఈ సీజన్లో స్థాయి తగ్గట్లు రాణించడం లేదు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ.. చిన్న ఇన్నింగ్స్‌ను పెద్దవిగా మలచలేకపోతున్నాడంటూ పేర్కొన్నాడు.
సన్ రైజర్స్ కెప్టెన్‌గా ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తున్న కేన్ విలియమ్సన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదని, ధాటిగా ఆడట్లేదని అన్నాడు. 15వ ఓవర్ వరకు తాను బ్యాటింగ్ చేయాలనే బాధ్యతతో ఆడాలనుకోవడం కరెక్టే కానీ.. ఏమాత్రం దూకుడును ప్రదర్శించకపోవడం ఐపీఎల్ లాంటి టోర్నీలో కరెక్ట్ కాదని జాఫర్ అన్నాడు. అతను బ్యాటింగ్ లైనప్‌లో చాలా ముఖ్యమైన ప్లేయర్ అయినప్పటికీ కనీసం 100స్ట్రైక్ రేట్‌తో కూడా బ్యాటింగ్ చేయకపోవడం సరికాదని పేర్నొన్నాడు. ఈ సీజన్లో కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఇంపాక్ట్ విలువ మైనస్‌లో ఉంది.
ఈ టోర్నీలో ఏ ప్లేయర్‌కు లేనంత తక్కువగా విలియమ్సన్ ఇంపాక్ట్ విలువ ఉండడం సన్ రైజర్స్‌ను కలవరపరుస్తుంది. అతని ఇంపాక్ట్ విలువ -85గా ఉంది. అంటే అసలు మ్యాచ్ విషయంలో అతను ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాడన్న మాట. ఇది ఓ కెప్టెన్‌గా విలియమ్సన్ ఎదుర్కొంటున్న చెత్త విషయమనే చెప్పాలి. కేవలం 96 స్ట్రైక్ రేటుతో ఈ సీజన్లో 200పరుగులు చేసిన కేన్ విలియమ్సన్కు ఇది అత్యంత ఫెయిల్యూర్ ఇండివిడ్యూవల్ ప్రదర్శనగా చెప్పొచ్చు. మరి మిగిలిన మ్యాచ్‌లలోనైనా కేన్ మామ రాణించి భారీ స్కోర్చేయాలని ఆశిద్దాం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Warner: వీడియో: విచిత్రమైన షాట్ ఆడిన వార్నర్! దీనికి మీరే పేరు పెట్టండి
Wasim Jaffer opines on Kane Williamson’s strike rate in IPL 2022.#WasimJaffer #DCvSRH #NotJustCricket #Cricket #CricTracker #DavidWarner #KaneWilliamson #IPL2022 pic.twitter.com/4PvBcXKzow
— CricTracker (@Cricketracker) May 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.