ఐపీఎల్ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్లు అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్‌కు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా వెంకటేశ్ అయ్యర్ వేగంగా పరుగులు చేశాడు. సిక్సులతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ మ్యాచ్ గడుస్తున్న కొద్ది ప్రమాదకారిగా మారుతున్న క్రమంలో అతని అవుట్ చేసేందుకు ముంబై బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఎంత మంది బౌలర్లను మార్చిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.
వెంకటేశ్ అయ్యర్‌తో ఏదో అంటూ కెమెరాకు చిక్కాడు. పైగా ఆ మరుసటి బంతికే కార్తీకేయ బౌలింగ్‌లో అయ్యర్ భారీ షాట్‌కు ప్రయత్నించి డానియల్ సామ్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో ఇషాన్ కిషన్ స్లెడ్జింగ్‌పై చర్చ జరుగుతోంది. అసలు అయ్యర్‌తో కిషన్ ఏమన్నాడో తెలియదు కానీ.. అయ్యర్ మాత్రం అనవసరపు షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవ్వడంతో.. కిషన్ మాటలకు అయ్యర్ తన ఏకాగ్రత కోల్పోయినట్లు అర్థం అవుతోంది. కేకేఆర్ మ్యాచ్ గెలవడంతో ఇది పెద్దగా వివాదం కాకున్నా.. కేకేఆర్ మ్యాచ్ ఓడిపోయిఉంటే ఈ విషయంపై తీవ్ర దుమారం రేగేది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ajinkya Rahane: డిఫరెంట్‌గా ట్రై చేసిన రహానే! సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం
MI bowlers were struggling to dismiss Venkatesh Iyer, Ishan Kishan took the onus of himself to distract the batter😱
Watch the incident here👇#KKRvRR #MI #KKR #VenkateshIyer #KKRHaiTaiyaar #MumbaiIndians #IPL #IPL2022 #IshanKishanhttps://t.co/cc5MPkpdsx
— SportsTiger (@sportstigerapp) May 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.