ఐపీఎల్ 2022లో మంగళవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ త్వరగా వికెట్లు పడిపోయాయి. ఆ జట్టు యువ ఆటగాడు రియాన్ పరాగ్ మాత్రం సూపర్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో హర్షల్ పటేల్ బౌలింగ్ ఒక ఫోర్ రెండు సిక్సులు కొట్టాడు. ఇన్నింగ్స్‌ను సిక్స్‌తో ముగించి గ్రౌండ్ బయటికి వెళ్తున్న క్రమంలో పరాగ్, హర్షల్ పటేల్ మాటామాట అనుకున్నారు. తన బౌలింగ్‌లో రెండు సిక్సులు కొట్టడంతో హర్ట్ అయిన హర్షల్ పరాగ్‌ను ఏదో అన్నట్లు తెలుస్తుంది. దానికి పరాగ్ రియాక్ట్ అవ్వగా.. హర్షల్ పటేల్ అతనిపైకి దూసుకొచ్చాడు.
అంతలోనే గ్రౌండ్‌లోకి వస్తున్న రాజస్థాన్ సపోర్టింగ్ స్టాఫ్ హర్షల్‌ను నిలువరించాడు. లేదంటే గొడవ ఇంకా ఎక్కువ అయ్యేది. తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభించింది. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ చతికిల పడింది. చివరి వికెట్‌గా హర్షల్‌పటేల్.. రియాన్ పరాగేకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ ముగిసిన తర్వాత.. సంప్రదాయంగా ఆటగాళ్లు అందరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఈ క్రమంలో రియాన్ పరాగ్.. హర్షల్ పటేల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాచాడు.. కానీ హర్షల్ పటేల్ మాత్రం పరాగ్‌కు షేక్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దీంతో ఖంగుతిన్న పరాగ్ పటేల్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒక యువ క్రికెటర్‌తో సీనియర్ అయిన హర్షల్ పటేల్ సరిగ్గా ప్రవర్తించలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.క్రికెట్‌లో భావోద్వేగాలు సహజం.. దాంతో పాటు ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న మాటలు కూడా వస్తుంటాయి… కానీ.. ఇలా క్రీడా స్ఫూర్తిని మరిచి ప్రవర్తించడం సరైంది కాదని హితవు పలుకుతున్నారు. 20 ఏళ్ల పరాగ్.. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడడం.. ఇన్నింగ్స్‌ను సిక్స్‌తో ముగించడంతో కొంత ఉత్సహ పడి ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోకుండా అత్యుత్సాహం చూపుతున్నాడంటూ అతనిపైకి దూసుకెళ్లడం.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం హర్షల్ పటేల్‌కు ఏమాత్రం తగదని క్రికెట్‌నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో పరాగ్ హాఫ్ సెంచరీతో పాటు.. నాలుగు మంచి క్యాచ్‌లు కూడా పట్టాడు. మరి హర్షల్‌పటేల్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చోటు మారిన ఆట మారలేదు! మరోసారి నిరాశ పర్చిన కోహ్లీ
Harshal vs riyan parag fight#RCBvsRR #parag #HarshalPatel #IPL20222 pic.twitter.com/Xotv4DGF8T
— John cage (@john18376) April 26, 2022
Harshal patel and riyan parag fight from stadium#riyanparag #harshalpatel #ipl #RRVSRCB #rcbvsrr #pune pic.twitter.com/2ICjMqO84O
— Jayesh #Rinku Stan acc (@Jayesh_2009) April 26, 2022
Immature Harshal Patel did not shake hands with 20 year old Riyan Parag. It’s such a shameful act #IPL2022 pic.twitter.com/USvcRM5kl3
— All About Cricket (@allaboutcric_) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.