ఐపీఎల్ 2022లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న అజింక్యా రహానే సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన ఒక షాట్ అతన్ని విమర్శల పాలు చేస్తోంది. రహానే మంచి క్లాస్ ప్లేయర్.. సాంప్రదాయమైన క్రికెట్ షాట్లు ఆడటంలో రహానే దిట్ట. రహానేను అతని కెరీర్ ఆరంభంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కుర్‌తో కూడా పోల్చారు. అలాంటి క్లాస్ ప్లేయర్ ఐపీఎల్ కంటే ముందు ఫామ్ కోల్పోయి టీమిండియాలో స్థానంలో కూడా పొగొట్టుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ రహానేను కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్ నుంచి కొన్ని మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇచ్చినా.. కూడా రహానే రాణించలేకపోయాడు. దీంతో అతన్ని కొన్ని మ్యాచ్‌లకు పక్కన పెట్టారు.
సోమవారం ముంబైతో మ్యాచ్‌లో చాలా మార్పులు చేసిన కేకేఆర్.. రహానేకు మరో అవకాశం కల్పించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు కనిపించిన రహానే.. 24 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కార్తీకేయ కుమార్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి బీట్ అయ్యాడు. తర్వాతి బంతిని కూడా అలాంటి షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు రహానే. దీంతో అప్పటి వరకు తన క్లాస్ బ్యాటింగ్‌తో బాగా ఆడుతున్న రహానే తనది కానీ శైలిని ప్రయత్నించి బోక్కబోర్లా పడటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తన బలాన్ని వదిలేసి.. తనకు రాని డిఫరెంట్ షాట్లు రహానే ఎందుకు ఆడుతున్నాడో తమకు అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.రహానే ఐపీఎల్ తర్వాత అయినా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే తన బలం అయిన ప్రాపర్ క్రికెట్ షాట్లపైనే దృష్టి పెట్టాలని ఇలా తన శైలి కాని స్టైల్‌ను ప్రయత్నించి నవ్వుల పాలు కావద్దని హితవు పలుకుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 43 పరుగులు చేసి రాణించాడు. నితీష్ రాణా కూడా 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు కొట్టి 43 పరుగులు చేశాడు. మంచి స్టార్ట్, 10 రన్స్‌పర్ ఓవర్‌తో 200 పరుగులు చేసేలా కనిపించిన కేకేఆర్ బుమ్రా దెబ్బకు చివర్లో పరుగులు చేయలేకపోయింది. ఇక 166 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 17.3 ఓవర్లలోనే 113 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్కడే 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. 52 పరుగుల తేడాతో మంచి విజయం సాధించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరి రహానే ఆడిన షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: ఇదేం చెత్త అంపైరింగ్ రా బాబు! రోహిత్‌ను వెంటాడుతున్న దురదృష్టం
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.