ఐపీఎల్ 2022లో గురువారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్‌ను 146 పరుగులకే కట్టడి చేసింది. ఆ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. 26 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. కాగా ఈ ఇన్నింగ్స్‌తో వార్నర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు ఆటగాడిగా వార్నర్ చరిత్ర సృష్టించాడు.
కొంత మంది ఆటగాళ్ల ఒక జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నా.. వార్నర్ మాత్రం ఆ రికార్డును రెండు జట్లపై సాధించాడు. ఇంతకుముందే పంజాబ్‌పై 22 ఇన్నింగ్స్‌ల్లో 1005 పరుగులు చేసిన వార్నర్.. గురువారం మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో ఆ జట్టుపై కూడా 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్‌పై 26 ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ 1008 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఆటగాడు కూడా రెండు జట్లపై 1000 పరుగులు చేయలేదు. మరి వార్నర్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ బౌలింగ్ పై లారా చెప్పిందే నిజమైంది! కానీ బ్యాటింగ్‌లో..
David Warner! #IPL2022 #DCvKKR pic.twitter.com/L9ZqvmyKPD
— RVCJ Media (@RVCJ_FB) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.