ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ గెలవడం వల్ల CSKకు వచ్చిన లాభం ఏమీ లేదు కానీ.. ఒక డిఫెండింగ్ ఛాంపియన్‌గా కనీసం పోటీ అయినా ఇవ్వడం ధర్మం. కానీ ఈ సీజన్‌లో చెన్నై ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజన్‌ను కాస్త ఊరటతోనైనా ముగిస్తుందనుకుంటే.. అది జరగలేదు. శుక్రవారం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్ మొయిన్ అలీ ఫ్లైయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. కానీ.. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా రాణించలేదు.
వెంటవెంటనే వికెట్లు పడటంతో కెప్టెన్ ధోని.. ఆచితూచి ఆడాడు. కానీ.. చివరి వరకు అదే పద్దతి పాటించి అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. సహజంగా ధోని ఇన్ని బంతులు ఎదుర్కొంటే చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోతాడు. ఆ తర్వాత ధోనిని అడ్డుకోవడం ఏ బౌలర్‌కైనా చాలా కష్టం. కానీ.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ధోని మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధోని కొంత వేగంగా ఎటాకింగ్ బ్యాటింగ్ చేసి ఉంటే.. అతనికి తోడుగా అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఫామ్‌లో ఉన్న మొయిన్ అలీ కూడా వేగంగా ఆడేవాడు. దీంతో చెన్నై స్కోర్ ఈజీగా 180 దాటి ఉంటేది. కానీ.. ధోని స్లో బ్యాటింగ్ కారణంగా 150 పరుగులకే CSK పరిమితం అయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 93 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో చెన్నై తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ తొలుత తడబడింది. కానీ ఓపెనర్ జైస్వాల్ 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 59 పరుగులు చేసి రాణించడం.. రవిచంద్రన్ అశ్విన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 40 పరుగులు చేసి రాజస్థాన్‌కు విజయం అందించారు. మరి ఈ మ్యాచ్ ధోని స్లోబ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravichandran Ashwin: చెన్నై బౌలర్లను ఆటాడుకున్న అశ్విన్! రాజస్థాన్‌కు సెకండ్ ప్లేస్ తెచ్చిపెట్టాడు
.@ashwinravi99 put on a solid all-round show & bagged the Player of the Match award as @rajasthanroyals beat #CSK. 👏 👏
Scorecard ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK pic.twitter.com/TWPU9ll8Vk
— IndianPremierLeague (@IPL) May 20, 2022