ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఒక మాస్టర్ ప్లాన్ రివర్స్ అయింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ అనుకున్నది ఒకటైతే ఇంకొటి జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుతు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 17.3ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 152పరుగుల వద్ద కొనసాగుతుంది. ఆ టైంలో క్రీజులో జిమ్మీ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. ఇక ఆ ఓవర్ లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ వేశాడు. నాలుగో బంతిని అశ్విన్ కవర్ దిశగా స్ట్రైక్ ఆడాడు. ఇక వెనువెంటనే రన్ తీయాలనే ఆలోచనలో బౌలింగ్ ఎండ్‌లో ఉన్న నీషమ్, అశ్విన్ పరుగు ప్రారంభించారు.
కానీ బంతి కవర్లో నేరుగా కెప్టెన్ రాహుల్ చేతిలోకి వెళ్లడంతో అతను వెంటనే బంతిని బౌలర్ రవి బిష్ణోయ్‌కు విసిరాడు. ఇక రనౌట్ ఎలాగూ తప్పదనే క్రమంలో నీషమ్ ఉంటే ఇంకాస్త స్కోరు పెంచొచ్చని.. తాను అవుట్ అయిన పర్వాలేదని నీషమ్ క్రీజ్‌లో ఉంటే చాలని అశ్విన్ బౌలర్ ఎండ్ వైపు పరుగుతీశాడు. అప్పటికే రవి బిష్ణోయ్ వికెట్లను గిరటేశాడు. దీంతో రనౌట్ అయినట్లు భావించిన అశ్విన్ పెవిలియన్ వైపు నడిచాడు. తన వికెట్ త్యాగం చేసి.. నీషమ్‌ను క్రీజ్ ఉంచాను అనే భావనలో అశ్విన్ పెవిలియన్ వైపు వెళ్తుంటే అంపైర్లు అతన్ని ఆపి ట్విస్ట్ ఇచ్చారు.
ఈ రనౌట్లో అశ్విన్ ఔటయ్యాడా లేదా నీషమ్ ఔటయ్యాడా అనే దాన్ని చెక్ చేసేందుకు థర్డ్ అంపైర్‌కు గ్రౌండ్ అంపైర్లు రిఫర్ చేశారు. రిప్లేలో చూసేసరికి పిచ్‌లో అశ్విన్, నీషమ్ ఒకరినొకరు క్రాస్ కాలేదని కన్పించింది. దీంతో అశ్విన్ రనౌట్ కాలేదని, నీషమ్ ఔటని థర్డ్ అంపైర్ పేర్కొనడంతో నీషమ్ పెవిలియన్ బాటపట్టాడు. రూల్స్ ప్రకారం.. రనౌట్ అయినప్పుడు ఇద్దరు బ్యాటర్లలో ఒకరినొకరు క్రాస్ అయినప్పుడే ఏ వైపు రనౌట్ జరిగిందో ఆ వైపు పరిగెత్తిన ప్లేయర్ అవుట్ అవుతాడు. తన కంటే నీషమ్ క్రీజ్‌లో ఉండటం ఉత్తమం అని భావించిన అశ్విన్ ప్లాన్ వర్క్‌అవుట్ కాలేదు.. సరికదా.. రివర్స్‌లో నీషమ్ పెవిలియన్ చేరాడు.
కానీ రాజస్థాన్‌కు మాత్రం పెద్ద నష్టమేం జరగలేదు. జిమ్మీ నీషమ్ (14పరుగులు 12బంతుల్లో) ఔటయినప్పటికీ.. మిగిలిన 2.2 ఓవర్లలో రాజస్థాన్ 26 పరుగులు పిండుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 178కి చేరుకుంది. లక్ష్యఛేదనలో లక్నో బ్యాటర్లో దీపక్ హుడా (59 పరుగులు 39 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) పోరాటం చేసినా అది సరిపోలేదు. మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించకపోవడంతో లక్నో 24 పరుగుల తేడాతో ఓటమి పొందింది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. మరి నీషమ్ రనౌట్ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: ధోని అన్న.. ఇది వన్డే కాదు టీ20! CSK బ్యాటింగ్‌పై పేలుతున్న సెటైర్లు
Neesham run out, not Ashwin 😅#LSGvRR #RRvsLSG
— Sushant Mehta (@SushantNMehta) May 15, 2022
LSG vs RR Watch – James Neesham Gets Run Out Courtesy Of A Mix Up With Ravichandran Ashwin https://t.co/0nFyqMrKAh
— Shahzad Arsi (@ShahzadArsi) May 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.